ఈ చాయ్ వాలాను ఇప్పుడు గుర్తు పట్టగలరా !

0

సోషల్ మీడియా .. ప్రస్తుతం దీని గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది సామాన్యులు కూడా సెలెబ్రెటీలుగా మారారు. అయితే సోషల్ మీడియాను సరైన విధంగా ఉపయోగించుకుంటే ఎవరైనా కూడా తగిన ప్రతిఫలం పొందవచ్చు. ఇకపోతే సోషల్ మీడియా లో నాలుగేళ్ల క్రితం పాకిస్థాన్ కి చెందిన ఓ ఛాయ్ వాలా ఫోటో వైరల్ అయిన సంగతి తెలిసిందే. రోజూ టీ అమ్ముకునే ఆ యువకుడు మోడల్ గా మారిపోయాడు. ఒకే ఒక్క ఫోటో అతని జీవితాన్ని మార్చేసింది.

పాక్లోని ఇస్లామాబాద్ కు చెందిన జవేరియా అలీ అనే ఫోటోగ్రాఫర్ ఫోటోల కోసం వీధుల్లో తిరుగుతూ మర్డన్ సిటీకి వెళ్లింది. అక్కడ ఓ దుకాణంలో అర్షద్ ఖాన్ అనే యువకుడు టీ చేస్తూ కనిపించాడు. ఫోటో క్లిక్మనిపించి… తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది జవేరియా. నీలికళ్లతో అందంగా ఉన్న అర్షద్ ఫోటో పాక్లో పెద్ద సంచలనమే అయ్యింది. అతనితో ఫోటోలు తీసుకునేందుకు అమ్మాయిలు క్యూలు కట్టారు.

రోజూ ఉదయాని కల్లా 40 నుంచి 50 మంది అమ్మాయిలు టీ కొట్టు దగ్గరికొచ్చి అతనితో సెల్ఫీలు దిగి వెళుతున్నారు. ఈ ఛాయ్ వాలా మోడల్ లా ఉన్నాడు అంటూ చాలామంది కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ ఛాయ్ వాలా నిజంగానే మోడల్ గా రాణిస్తున్నాడు. ఆ ఫోటో విపరీతంగా వైరల్ అవ్వడంతో అర్షద్ కి మోడల్ గా మంచి అవకాశాలు వచ్చాయి అలా వచ్చిన డబ్బుతో తాజాగా ఛాయ్ వాలా రూఫ్ టాప్ పేరుతొ ఓ హైటెక్ కేఫ్ ను మొదలుపెట్టాడు. పేరు లో ఛాయ్ వాలా అని తీసేయమని కొందరు చెప్పినా తన మూలాలను మాత్రం విడిచిపెట్టలేదు.