ఘోర కరోనా నిన్ను సంహరిస్తానంటూ నృత్య గర్జన చేసి..!!

0

కరోనాపై పాట పడిన చాలా మంది అదే కరోనాకు బలైన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ నృత్యకారిణి శోభా నాయుడు కరోనా బారిన పడి మృతి చెందారు. ఏప్రిల్ లో కరోనాపై “ధరాతలానికి ముళ్ల కిరీటం కరోనా…“ అంటూ మహమ్మారి కరోనాపై రాసిన పాటకు కూచిపూడి నృత్యాన్ని కంపోజ్ చేసి ఆకట్టుకున్నారు. క్రూర కరోనా… ఘోర కరోనా నిన్ను సంహరిస్తా!! అంటూ అద్భతంగా అభినయించిన శోభా నాయుడు అదే కరోనాకు బలి అయ్యారు.

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సంగీతం అందిచిన ఈ పాటని హరిని ఇవటూరి ఆలపించారు. శోభా నాయుడు వయసు 58 ఏళ్లు. వెంపటి చిన సత్యం వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు. కూచిపూడి నృత్యంలో పద్మ పురస్కారాన్ని దక్కించుకుని నృత్యకళాకారిణిగా ఫేమస్ అయ్యారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ క్రమంలోనే ఆమెకు కరోనా సోకిందట. పరిస్థితి విషమించడంతో ఆమె బుధవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. నిజానికి కరోనా వల్ల ఆమె మరణించలేదు. తనకు ఉన్న దీర్ఘ కాలిక సమస్యలు తిరగబెట్టడం ఇలాంటి టైమ్ లో సమస్యాత్మకమైంది.