కేజీ పండ్లు తినేకంటే ఇది 1 గ్రాము తింటే చాలట

0

ఇక్కడ మన పోరగాండ్లకు హార్లిక్స్ లు బోర్నవిటాలు ఇచ్చి పౌషకాహార లోపం తలెత్తకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కానీ కెన్యా సహా పశ్చిమ ఆఫ్రికా కొన్ని దేశాల్లో పేదరికంతో కనీసం తినడానికి తిండి లేక పేదలు అలమటిస్తున్నారు. ఇప్పటిదాకా పౌషకాహార లోపం నుంచి బయటపడే ఆహారం ప్రపంచంలో అత్యంత ఖరీదుగా ఉంది. పేదలు దాన్ని కొనలేని పరిస్థితులున్నాయి. సంపూర్ణ ఆహారమైన గుడ్డు కూడా ఈ కరోనా టైంలో ఖరీదు అయిపోయింది. ఒక 1 గ్రాము నాచులో చికెన్ గుడ్లు పండ్లలో కంటే ఎక్కువగా పోషకాహారం ఉన్న సంగతి మీకు తెలుసా? నిజంగానే ఇది అద్భుతమైన పౌష్టికాహారంగా ఖ్యాతి గడించింది.

అయితే ప్రపంచంలోనే పోషకాహార లేమిని తరిమికొట్టగల ఆహారం ‘స్పిరులినా’. ఇది తినడానికి పనికొచ్చే నాచు. మాత్రలు పౌడర్ క్యాండీస్ రూపంలో ఈ స్పిరులినా లభిస్తుంది.

ప్రపంచంలోనే అత్యధికంగా దీన్ని ఎగుమతి చేస్తున్న దేశం కూడా భారత్ కావడం విశేషం. 1 కేజీ పండ్లు 300 గ్రాముల చికెన్ 30 గ్రాముల చేపలు 1 గుడ్డులో విడివిడిగా ఉండే పోషకాలు 1 గ్రాము స్పిరులినాలో ఉంటాయి.

అందుకే ఇంతటి పౌష్టికాహారాన్ని భూమి మీద ఆకాశంలో ఉండే వ్యోమగాములకు ఆహారంగా అందిస్తారు. కాస్త శిక్షణ తీసుకుంటే స్పిరులినాను ఇంటిదగ్గరే సాగు చేసుకోవచ్చని.. దీని సాగు గురించి ఇంటర్నెట్ లో వెతికితే దొరుతుందని నిపుణులు సూచిస్తున్నారు.