బరువు తగ్గేందుకు స్వీటీ కసరత్తులు

0

స్వీటీ అనుష్క శెట్టి ఇటీవల తన రూపం మార్చుకునేందుకు .. బరువు తగ్గేందుకు విదేశాల్లో ట్రీట్ మెంట్ తీసుకున్నారని ప్రచారమైంది. సహజ సిద్ధమైన పద్ధతిలో వెయిట్ తగ్గేందుకు టర్కీ లాంటి చోట నేచురల్ ట్రీట్ మెంట్ కి ప్రాధాన్యతనిచ్చారని చెప్పుకున్నారు. నాలుగైదేళ్ల క్రితమే `సైజ్ జీరో` మూవీ కోసం భారీగా వెయిట్ పెరగడం వల్ల వచ్చిన చిక్కు అది. బాహుబలి2 చిత్రీకరణ అనంతర కాలంలో దీనిపై ఎక్కువగా ముచ్చటించుకున్నారు.

అయితే ఇటీవల రిలీజైన నిశ్శబ్ధంలో అనుష్క యావరేజ్ లుక్ తో కనిపించారు. అంతకుముందు స్వీటీ స్లిమ్ లుక్ కి సంబంధించిన ఫోటోల్ని రివీల్ చేసినా మూవీలో కనిపించిన తీరు వేరుగా ఉందని గుసగుసలు వినిపించాయి. ఏదేమైనా ఇప్పుడు తన రూపంపై రివ్యూలు చేసుకున్న అనుష్క మరోసారి ఛేంజ్ కోరుతున్నారట.

మళ్లీ నాజుకుగా తయారవ్వడానికి రెడీ అవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ లాక్ డౌన్ గ్యాప్ లో ప్రస్తుతం మాత్రం చాలా లావుగా అయిందని తెలిసింది. అయితే ఇలా లావుగా అవ్వడం కూడా స్లిమ్ గా అవ్వడానికి అయ్యే ప్రక్రియలో భాగం అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఏదేమైనా అనుష్కకు ఇలా బరువు పెరగడం తర్వాత తగ్గడం ఒక హ్యాబిట్ గా మారిపోయింది. నిశ్శబ్ధం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తదుపరి మరిన్ని చిత్రాలకు సంతకాలు చేసేందుకు స్వీటీ సిద్ధమవుతోందని సమాచారం.