Templates by BIGtheme NET
Home >> Telugu News >> చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం షాక్

చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం షాక్


మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ గా తేలి అనంతరం తప్పుడు రిపోర్టుల కారణంగా అలా వచ్చిందని.. తనకు నెగెటివ్ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తప్పుడు రిపోర్ట్ కారణంగా తనకు ఈ పరిస్థితి ఎదురైందని వెల్లడించాడు.

కరోనా లేదని సోషల్ మీడియాలో తెలిపిన చిరంజీవి తాజాగా తన గురువు అయిన విశ్వనాథ్ ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనను కౌగిలించుకొని ఆత్మీయత చాటుకున్నారు. ఈ క్రమంలోనే వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒక్కసారి పాజిటివ్ వచ్చి ఆ తర్వాత నెగెటివ్ అని వచ్చినప్పటికీ చిరు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరిగా ఫాలో అవ్వాలన్నారు.

పాజిటివ్ గా తేలి.. ఆపై నెగెటివ్ వచ్చినా ఐసీఎంఆర్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం క్వారంటైన్ లో ఉండాల్సిందేనని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

ఏ కరోనా పరీక్ష కూడా నూటికి నూరుశాతం ఖచ్చితత్వంతో రాదని స్పష్టం చేశారు. ఒకసారి పాజిటివ్ వస్తే.. పాజిటివ్ గానే భావించాల్సి ఉంటుందని.. తర్వాత నెగెటివ్ వచ్చినా లక్షణాలు లేకున్నా క్వారంటైన్ లో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.