ఆ చూపుతోనే చంపేసేలా ఉంది

0

తెలుగు ప్రేక్షకులకు రెండు సినిమాలతోనే బాగా దగ్గర అయిన కియారా అద్వానీ ఆ తర్వాత బాలీవుడ్ బాగా పాపులారిటీని దక్కించుకోవడంతో అక్కడే వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె మూడు నాలుగు సినిమాలను అక్కడే చేస్తోంది. వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ లో తన బోల్డ్ నటనతో వావ్ అనిపించిన ఈ అమ్మడు ఇటీవల విడుదలైన అక్షయ్ కుమార్ మూవీ లక్ష్మిలో కూడా మంచి పాత్రను దక్కించుకుని మరింత పాపులారిటీ దక్కించుకుంది. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ తో మొత్తం మారిపోయిన ఈమె క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో నెటిజన్స్ ఊపిరి ఆపేంత హాట్ ఫొటోలను షేర్ చేస్తుంది.

ఎల్లీ ఇండియా కోసం ఈమె చేసిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈమె షేర్ చేసిన ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే ఈసారి ఈమె చేసిన ఎల్లీ ఇండియా కవర్ ఫొటో మరింత కైపు ఎక్కించే విధంగా ఉంది. ఆ చూపుతోనే కియారా చంపేస్తున్నట్లుగా అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. క్లోజప్ లో కియారాను చూస్తుంటే మతి పోవడం ఖాయం అన్నట్లుగా ఉంది. ఈ అమ్మడు ఎంట్రీతో మొత్తం కవర్ కే అందం వచ్చిందని ఇన్నాళ్లు పెద్దగా తెలియని ఎల్లీ ఇండియా మ్యాగజైన్ ఇప్పుడు ఒక్కసారిగా కిరాయా వల్ల ఫేమస్ అయ్యిందంటున్నారు.