మరో మూవీలో బాలయ్య లీడ్ రోల్!

0

నందమూరి బాలకృష్ణ ఆరు పదుల వయసులో కూడా వరుసగా హీరోగానే సినిమాలు చేస్తున్నారు. కెరీర్ లో చాలా తక్కువ సార్లు మాత్రమే బాలకృష్ణ వేరే హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. కొన్నాళ్ల క్రితం మంచు హీరో మనోజ్ నటించిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో బాలకృష్ణ కీలక పాత్రలో కనిపించారు. ఆ సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది. సినిమాలోని బాలయ్య పాత్రకు కూడా పెద్దగా పేరు ప్రతిష్టలు వచ్చింది లేదు. ఆ సినిమాలో బాలయ్య నటించాడనే విషయాన్ని కూడా చాలా మంది అభిమానులు గుర్తు పెట్టుకోలేదు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత బాలకృష్ణ మరో యంగ్ హీరో మూవీలో ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్ ను చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో యంగ్ హీరో నాగశౌర్య ఒక సినిమాను చేయబోతున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ ను కీలక పాత్రలో నటింపజేసేందుకు నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నారట. బాలయ్యకు నిర్మాతకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బాలయ్య ఎక్కువ సినిమాలు చేసిన నిర్మాతల్లో శివలెంక కృష్ణ ప్రసాద్ ఒకరు. అవి కూడా సూపర్ హిట్ సినిమాలే అవ్వడంతో కృష్ణ ప్రసాద్ పై బాలయ్యకు మొదటి నుండి కూడా అభిమానం మరియు గౌరవం అనడంలో సందేహం లేదు.

ఆ అభిమానంతో ఆయన నిర్మాణంలో రూపొందబోతున్న నాగశౌర్య సినిమాలో బాలయ్య ఖచ్చితంగా లీడ్ రోల్ ను పోషించేందుకు ఒప్పుకునే అవకాశం ఉందంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే బాలయ్య వద్దకు ఈ ప్రపోజల్ వెళ్లిందని ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. మరి అసలు విషయం ఏంటీ అనేది అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.