అంబికా సంస్థల పై సీబీఐ దాడులు !

0

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని అంబికా సంస్థలపై సీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. అంబికా సంస్థలతో పాటుగా కుటుంబ సభ్యుల ఇళ్లల్లో కూడా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే అంబికా సంస్థలకు సంబంధించి వేర్వేరు పేర్లతోలోన్లు సేకరించారన్న నేపథ్యంలో అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నారు.

ఇక మరోవైపు అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ గృహంలో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో ఏలూరు పవర్ పేట స్టేట్ బ్యాంకులో కూడా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే 7 నెలల అనంతరం మరోమారు ఇలా సీబీఐ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఈ సోదాలకు సంబంధించి ఇంతవరకూ అధికారులు కానీ అంబికా కానీ మీడియా ముందుకు రాలేదు. అయితే సోదాల్లో ఏమేం దొరికాయి లోన్ల సంగతేంటి అనే విషయాలపై సీబీఐ అధికారులు మీడియా మీట్ నిర్వహించి వెల్లడిస్తారని సమాచారం.