ఉద్యోగం కోల్పోయిన వారికి నిరుద్యోగ భత్యం.. 50శాతం జీతం

0

కరోనా-లాక్ డౌన్ తో ఉద్యోగాలు కోల్పోయిన వేతన జీవులను ఆదుకోవాలన్న డిమాండ్లు దేశంలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలు పోగొట్టుకున్న చిరువేతన జీవులకు అప్పటి వరకు పొందిన జీతాల్లో 50శాతాన్ని మూడు నెలలకు లెక్కేసి చెల్లించేలా కంపెనీలకు వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం తాజాగా నిబంధనలను సవరించింది.

ప్రస్తుతం ఒకసారి ఉద్యోగాలు తొలగించిన తర్వాత వారికి ఎలాంటి జీతభత్యాలు చెల్లించడం లేదు. కానీ కేంద్రం మానవతా దృక్ఫథంతో సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది చిరువేతన జీవులకు లబ్ధి చేకూరుతుంది.

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐ)లో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో 40లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి 24నుంచి డిసెంబర్ 31 మధ్య ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఈ భత్యం చెల్లించబడుతుందని కేంద్రం తెలిపింది.