Templates by BIGtheme NET
Home >> Telugu News >> గన్నవరం లో ఏం అవుతుందో..

గన్నవరం లో ఏం అవుతుందో..


వైసీపీలోనే ఉంటూ.. వైసీపీ అధికార దర్పాన్ని అనుభవిస్తూ.. అదే వైసీపీ అధ్యక్షుడిపై చులకనగా మాట్లాడిన గన్నవరం ఎమ్మెల్యే వంశీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాట్ కామెంట్స్ చేశారు. ఇవి ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.. కేసులకు భయపడి వైసీపీలోకి ఇన్ డైరెక్ట్ గా చేరి సంసారం చేస్తున్న వల్లభనేని వంశీ 151 సీట్లు 51శాతం ఓట్లతో గెలిచిన ఏపీ సీఎంను ఏదో సామాన్యుడు అన్నట్టు తీసిపారేయడం కలకలం రేపింది.

తాజాగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు వంశీ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. ‘రాజీనామాకు భయపడుతున్నారా’ అని వంశీని ప్రశ్నించగా.. నేను జగన్ గాలిని కూడా తట్టుకొని గెలిచానని.. ఇప్పుడు ఒక లెక్కనా అని బదులిచ్చాడు. ఈ మాట విన్న అక్కడి వైసీపీ వాళ్లు రగిలిపోతున్నారు.

మొన్న జరిగిన గలాబాపై కూడా వంశీ తేలికగా కొట్టిపారేశారు. చిన్న చూపు చూస్తూ వాళ్లు అంతా తన బంధువులేనని.. అది సమిసిపోతుందిలే అని కొట్టిపారేశారు. విక్రమార్కుడు సినిమాలోని డైలాగ్ చెప్పి ‘ఉంటే ఒక్కడే ఉండాలి.. అది నేనే అని..’ అంటూ భారీ డైలాగ్ చెప్పాడు. ఇది విన్న వైసీపీ శ్రేణులు ఖిన్నులయ్యారు. అసలు వల్లభనేని వంశీ వైసీపీ సభ్యుడా? టీడీపీ సభ్యుడా? బీఫాం ఏ పార్టీ ఇచ్చింది.? వేరే పార్టీ గుర్తు మీద గెలిచాడు. ఇవన్నీ చెప్పక చంద్రబాబును తిట్టడం… లోకేష్ ను పప్పు అనడం తప్ప ఏం చేస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు. ధైర్యం ఉంటే ఇప్పుడు రాజీనామా చేయి అని లోకల్ గా ఉన్న వైసీపీ వాళ్లు టీడీపీ వాళ్లు అడుగుతున్నారు. కానీ వంశీ మాత్రం అలాంటి పరిస్థితి లేదు అని తప్పించుకుంటున్నాడు. అంటే భయపడుతున్నాడని లోకల్ గా అనుకుంటున్నారు.

నిజంగా వల్లభనేని వంశీకి ధైర్యం ఉంటే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి స్పీకర్ తో ఆమోదించుకోవచ్చు కదా అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో దుబ్బాక ఎన్నిక వస్తోంది. దీంతో ఇప్పుడు రాజీనామా చేస్తే దాంతోపాటు ఎన్నికలు వస్తే వైసీపీ తరుఫున గెలిచి అధికారికంగా వైసీపీ నేతవు కావచ్చు కదా అని కొందరు హితవు పలుకుతున్నారు.

ఏది ఏమైనా వైసీపీ వాళ్లతో తిరుగుతూ జగన్ గాలిలో కూడా గెలిచాను అనడం.. అతడి గర్వం అని.. ఇది మంచి పద్ధతి కాదు అని వైసీపీ వాళ్లు అంటున్నారు.ఇలాంటి మళ్లీ రిపీట్ అయినా.. జగన్ మీద మరో సారి నోరు పారేసుకున్నా హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తాం అని కొందరు అంటున్నారు. చూడాలి మరి గన్నవరం లో ఏం అవుతుందో..