అమిత్ షా – చంద్రబాబు ఇద్దరూ కలసి ప్రయాణమా?

0

దారులు వేరైనా.. వారి లక్ష్యం ఒక్కటే. అదే అధికారం. అందుకే పాత మిత్రులు.. ప్రస్తుతం శత్రువులు మళ్లీ ఒక్కటి కాబోతున్నారట.. వైరాలు మలిచి మళ్లీ హ్యాయ్.. బాయ్ అనుకుంటున్నారట.. కేంద్రంలోని బీజేపీతో చంద్రబాబు దోస్తీ మొగ్గుతొడుగుతోందట.. అమిత్ షాతో చంద్రబాబు కలిసి ఒకే జిప్సీలో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడట.. మరి వీరి ప్రయాణం 2024లో లక్ష్యం చేరుతుందా.? పంచర్ అవుతుందా అన్నది వేచిచూడాలని విశ్లేషకులు అంటున్నారు.

బీజేపీలో నంబర్ 2 పొజిషన్ లో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఇటీవల అనూహ్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు మాటలు కలిశాయట.. ఇద్దరూ బాగా టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం భవిష్యత్ రాజకీయాల కోసమా? లేక జగన్ మీద ఫిర్యాదులు చేయడానికా అనేది అర్థం కావడం లేదు అని బీజేపీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు.

కరోనా తర్వాత బీజేపీ మీద కొంత దేశంలో వ్యతిరేకత కనపడుతోంది. అయితే అందిపుచ్చుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలతో క్యాష్ చేసుకోలేక పోతోందని అని టాక్ వినిపిస్తోంది.

వాజ్ పేయి ఉన్నప్పటి నుంచి టీడీపీ-బీజేపీ కాంబినేషన్ సక్సెస్ ఫుల్ అయ్యిందని.. అందుకే మళ్లీ కలుద్దాం అని లెక్కలు వేసుకుంటున్నారట.. చంద్రబాబు మీద కేంద్రంలోని బీజేపీ ఒక రకంగా ఆలోచిస్తుండగా.. రాష్ట్ర బీజేపీ మాత్రం చంద్రబాబు మీద కారాలు మిరియాలు నూరుతోంది.

అయితే చంద్రబాబు మాత్రం 2024 ఎన్నికల లోపల జమిలి ఎన్నికలు వస్తే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారట.. అందుకే బీజేపీతో టచ్ లో ఉన్నాడని అంటున్నారు. చంద్రబాబుకు రాష్ట్ర బీజేపీ మీద అంత నమ్మకం లేదు అని.. పవన్ కళ్యాణ్ మీద కూడా పెద్దగా విశ్వాసం లేదు అని భావిస్తున్నారట..

ఇక అమిత్ షాకు కూడా పవన్ కళ్యాణ్ కు బూత్ స్థాయిలో అంత సీన్ లేదని.. అందుకే చాన్స్ వస్తే టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందని కూడా ఆలోచన చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. అందుకే ఇప్పుడు మళ్లీ భవిష్యత్ రాజకీయాల కోసం చంద్రబాబు మాట కలుపుతున్నాడు కావచ్చు అని కొందరు అనుకుంటున్నారు.