Templates by BIGtheme NET
Home >> Telugu News >> 73 సెకన్ల ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూడటం ఖాయం

73 సెకన్ల ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూడటం ఖాయం


పతంగులు పరిచయం లేనోళ్లు ఉండరు. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అందరూ పతంగుల్ని ఎగుర వేయటానికి తెగ సరదాను ప్రదర్శిస్తారు. మానసిక ఉల్లాసాన్ని కలిగించే పతంగుల కార్యక్రమంలో తాజాగా ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వీడియో చూడకుండా.. మాటలు చెబితే ఒక పట్టాన నమ్మరు సరికదా బడాయి మాటలు చెబుతున్నారని భావిస్తారు. తైవాన్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే..

తైవాన్ హిన్చులో భారీ పతంగుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంత భారీగా ఉంటాయంటే.. మనం ఊహించలేనంత. ఆ బారీ పతంగిని ఎగురవేసే క్రమంలో ఎలా చిక్కుకుపోయిందోకానీ.. మూడేళ్ల బాలిక చిక్కకుంది. అదే సమయంలో గాలి వేగం ఎక్కువగా ఉండటం తో.. కళ్లు మూసి తెరిచే లోపు.. భారీ పతంగితో పాటు పాప కూడా గాల్లోకి లేచింది.

అసలేం జరిగిందో అర్థమయ్యే లోపు.. గాలి వేగానికి పతంగి మరికాస్త పైకి ఎగిరింది. లక్కీగా.. గాలి వేగం తగ్గటంతో ఒక్కసారి పతంగి కిందకు వచ్చింది. దాదాపు పది మీటర్లు గాల్లోకి బాలిక ఎగరటంతో ఒక్కసారి షాక్ తిన్నారు అక్కడి వారంతా. కిందకు వస్తున్న పతంగిని ఒడుపుగా పట్టుకున్న వారు.. ఆ పాపను దాని నుంచి విడతీశారు. ఎలాంటి గాయం కాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

గాల్లోకి ఎగరటం.. మళ్లీ కిందకు రావటం అంతా కేవలం ఏడు సెకన్లలోనే చోటుచేసుకోవటం గమనార్హం. ఈ ఉదంతంలో ఆ చిన్నారికి ఏమీ కాకపోవటంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన 73 సెకన్ల వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ అనూహ్య పరిణామంతో అక్కడి వారంతా నిర్ఘాంతపోయారు. వెంటనే స్పందించిన అధికారులు కైట్ ఫెస్టివల్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

https://www.youtube.com/watch?v=pMPz92x75iw