34 యేళ్ల సినీ కెరీర్ పూర్తిచేసుకున్న ‘విక్టరీ వెంకటేష్’..!!

0

విక్టరీ వెంకటేష్.. తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన నటుడని అందరికి తెలిసిందే. కానీ ఆయన ఇండస్ట్రీలో అడుగుపెట్టి మూడు దశాబ్దాలు గడిచిందని ఎంతమందికి తెలుసు. నేటికీ హీరోగా ఆయన కెరీర్ ప్రారంభించి 34 సంవత్సరాలు అవుతుంది. ఇన్నేళ్ల సినీ చరిత్ర కలిగిన వెంకటేష్ ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ఎందరో గొప్ప దర్శకులతో కలిసి పనిచేసారు. అలాగే ఇన్నేళ్ల సినీ జీవితంలో విక్టరీ వెంకటేష్ ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఎందరో హీరోలు ఇండస్ట్రీలోకి వస్తుంటారు పోతుంటారు. కానీ విక్టరీ వెంకటేష్ ఇప్పటికి హీరోగానే కొనసాగుతున్నారంటే ప్రేక్షకులు ఆయనను ఎంతగా ఆదరిస్తున్నారో అర్ధమవుతుంది. సహజమైన నటనతో తెలుగువారి మనసులను గెలుస్తూ వస్తున్నారు వెంకటేష్. అయితే 1986 ఆగష్టు 14న వెంకీ హీరోగా ఫస్ట్ మూవీ కలియుగ పాండవులు విడుదల అయింది.

బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా రూపొందింది. ఈ సినిమాతోనే హీరోయిన్ ఖుష్బూ సినీ కెరీర్ ప్రారంభించింది. తెలుసు కదా.. దర్శకేంద్రుడి సినిమా అంటే రొమాన్స్ మాములుగా ఉండదు. అన్నీ హంగులతో సినిమా రూపొందించారు. ఇదిలా ఉండగా.. తాజాగా వెంకటేష్ హోమ్ ప్రొడక్షన్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ వారు సోషల్ మీడియాలో వెంకీ 34యేళ్ళ సినీ కెరీర్ పూర్తి చేసుకున్న కారణంగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో వెంకటేష్ లేటెస్ట్ మూవీలతో పాటు ఆయన పోషించిన సూపర్ హిట్ క్యారెక్టర్స్ అన్నీ కలిపి పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే గత కొంతకాలంగా స్పీడ్ తగ్గించిన వెంకటేష్.. ఇటీవలే వెంకీమామ సినిమా విజయంతో జోరు పెంచారు. ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ అసురన్ రీమేక్ తెలుగు నారప్పలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.