Templates by BIGtheme NET
Home >> Cinema News >> అందుకే సినిమాలను వదిలేశాను: అబ్బాస్

అందుకే సినిమాలను వదిలేశాను: అబ్బాస్


‘అబ్బాస్..’ 1996లో విడుదలైన ‘ప్రేమదేశం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. అప్పట్లో అమ్మాయిలకు కలల రాకుమారుడు. బాయ్ ఫ్రెండ్ అంటే అలా ఉండాలి అని చెప్పుకునేవారు. ఇక అబ్బాయిలకు ఆయన హెయిర్ స్టైల్ అంటే తెగ క్రేజ్. ఆ స్టైల్ చాలా కాలం కొనసాగింది. ఇక అబ్బాస్ కెరీర్ కూడా జోరుగానే కొనసాగింది.

ఆయన కెరీర్లో మంచి మంచి హిట్ సినిమాలున్నాయి. తమిళ్ తెలుగు కన్నడ మలయాళంలో చాలా సినిమాలు చేశాడు. ఒక దశలో ఏడాదికి ఆరేడు సినిమాలు చేశాడు ఈ లవర్ బాయ్. తెలుగులో బాలకృష్ణ వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించాడు. కానీ.. కొన్నేళ్ల తరవాత ఆయన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఆ తర్వాత చాలా కాలం ప్రముఖ యాడ్ లో కనిపించాడు. అయితే.. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ఆయన వెండి తెరకు దూరంగానే ఉంటున్నాడు.

తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దీనికి గల కారణాన్ని రివీల్ చేశాడు అబ్బాస్. సినిమాల్లో యాక్టింగ్ చాలా బోర్ కొట్టిందని అందుకే నటనకు స్వస్తి చెప్పాను అన్నాడు అబ్బాస్. మనసు పెట్టలేనప్పుడు నటనకు న్యాయం చేయలేనని అనిపించి బయటికి వచ్చేశానని చెప్పుకొచ్చాడు.