బిబి4 : ఇంతలా అందరిని అభి ఎలా మాయ చేశాడో?

0

బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ విజేత అభి అంటూ సోషల్ మీడియాలో చాలా బలమైన ప్రచారం మొదలు అయ్యింది. ఆయన వైపు వీస్తున్న గాలులను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఆయనే విజేత అవుతాడేమో అనిపిస్తుంది. కంటెస్టెంట్స్ కొందరి తప్ప ఎక్కువ మందికి అభి అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది. మెహబూబ్ బయటకు వచ్చిన తర్వాత తనకు సోహెల్ కంటే కూడా అభి మద్దతుగా నిలిచేవాడు అంటూ చేసిన వ్యాఖ్యలు ఆతడి స్థాయిని మరింతగా పెంచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా ఎలిమినేట్ అయిన లాస్య కూడా తనకు అందరిలో కంటే అభిజిత్ అంటే ఇష్టం అంది. చాలా కూల్ గా ఉంటాడు. అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడుతాడు అంటూ అభిపై ఆమె చేసిన వ్యాఖ్యలు అభి గ్రాఫ్ ను మరింత పెంచాయి అనడంలో సందేహం లేదు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కొందరు కుటుంబ సభ్యులు కూడా తమకు అభి అంటే ఇష్టం అంటూ స్వయంగా చెప్పడం జరిగింది.

ఫిజికల్ గా టాస్క్ లు గొప్పగా చేయడం.. డాన్స్ విషయంలో మరీ వీక్ అయినా కూడా ఇంతగా ప్రేక్షకులను అభి ఎలా మాయ చేశాడు అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అతడి మైండ్ గేమ్ గురించి అంతా ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు. చాలా సింపుల్ గా కనిపించినా కూడా ప్రతి టాస్క్ లో కూడా లోతుగా ఆలోచించే వ్యక్తిత్వం అతడిది అంటూ ఇతరులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే బిగ్ బాస్ ఈ సీజన్ విజేత ఆయనే అంటూ చాలా నమ్మకంగా అంతా ఉన్నారు.