మగ బిడ్డకు జన్మనిచ్చిన నటి అమృత రావు

0

నటి అమృత రావు మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం అమృత తల్లి అయ్యింది అంటూ ఆమె సోషల్ మీడియా టీం తెలియజేసి శుభాకాంక్షలు తెలియజేసింది. అమృత భర్త ఆర్జే ఆన్ మోల్ కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియ ద్వారా తెలియజేసి ఆనందం వ్యక్తం చేశాడు. మా ఇంట్లో కొత్త ఆనందాలు మొదలు అయ్యాయి అంటూ ఆన్ మోల్ పేర్కొన్నాడు. అమృత మరియు బాబు ఇద్దరు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారంటూ సోషల్ మీడియా ద్వారా కుటుంబ సభ్యులు తెలియజేశారు. అమృత మరియు ఆన్ మోల్ దంపతులు అక్టోబర్ నెలలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లుగా ప్రకటించారు. ప్రకటన చేసిన నెల లోపే అమృత బాబుకు జన్మ నిచ్చింది.

అమృత సినీ కెరీర్ విషయానికి వస్తే తెలుగులో మహేష్ బాబుకు జోడీగా అతిథి సినిమాలో నటించింది. నటిగా మంచి మార్కులు దక్కించుకున్నా ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో తెలుగులో స్టార్ డం దక్కించుకోలేక పోయింది. ఈ అమ్మడు బాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. సోషల్ మీడియా ద్వారా ఇప్పటికి అభిమానులతో టచ్ లో ఉంటున్న ఈ అమ్మడు కొన్నాళ్ల క్రితం ఆర్జే ఆన్ మోల్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా వెండి తెర మరియు బుల్లి తెరపై సందడి చేస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు బాబుకు జన్మనివ్వడంతో కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.