మీటూ వ్యాఖ్యలు చేసింది.. పార్టీలో చేరి ఉపాధ్యక్షురాలు అయ్యింది

0

సౌత్ తో పాటు నార్త్ లో కూడా పలు సినిమాల్లో నటించిన పాయల్ ఘోష్ ఇటీవల ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ పై మీటూ అంటూ లైంగిక ఆరోపణలు చేయడం ఆ సమయంలో మరో హీరోయిన్ పై వ్యాఖ్యలు చేయడం వంటి కారణాలతో పాయల్ ఘోష్ ఒక్కసారిగా పాపులారిటీ దక్కించుకుంది. సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్న ఈ సమయంలో మీటూ వ్యాఖ్యలతో వచ్చిన పాపులారిటీతో రాజకీయ పార్టీలో చేరిపోయింది. రాజకీయ అరంగేట్రం చేసిన పాయల్ ఘోష్ కు వెంటనే పార్టీ పదవి దక్కింది.

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా లో పాయల్ చేరింది. కేంద్ర మంత్రి ఆ పార్టీ అధినేత అయిన రాందాస్ అథవలే సమక్షంలో పార్టీ తీర్థంను ఆమె పుచ్చుకుంది. వెంటనే పార్టీ మహిళ విభాగం ఉపాధ్యక్షురాలిగా ఆమెను నియమిస్తున్నట్లుగా రాందాస్ అథవలే ప్రకటించారు. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంకా పలువురు ఆ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు హాజరు అయ్యారు. ఉన్నట్లుండి పార్టీలో జాయిన్ అవ్వడం ఏంటీ అంటూ పాయల్ ను ప్రశ్నించగా ఆమె నవ్వేసి వెళ్లి పోయింది.