పెళ్లి గురించి పెద్దగా ఆలోచన లేదంటున్న తేజ్…!

0

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్న తరుణంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘నో పెళ్లి.. ఈ తప్పే చేయకురా వెళ్లి’ అంటూ కరోనా డేస్ లో పాడుకుంటూ వచ్చిన సాయి తేజ్ కూడా తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి ఓ ఇంటివాడు అవ్వాలని డిసైడ్ అయ్యాడని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు. అంతేకాక మెగాస్టార్ చిరంజీవి సైతం ఇటీవల తేజ్ కి బర్త్ డే విషెస్ చెబుతూ ‘డియర్ తేజ్.. ‘సోలో’గా ఉన్నప్పుడే ఫుల్ గా ఎంజాయ్ చేసేయ్. నీ ‘సోలో’ లైఫ్ ఇంకొన్ని రోజులే’ అని ట్వీట్ చేసి మెగా హీరో పెళ్లి గురించి హింట్ ఇచ్చాడు. అయితే తేజ్ దీనిపై స్పందిస్తూ తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని.. అయితే పెళ్లంటే తనకు పెద్దగా ఆలోచన లేదని అంటున్నాడు.

సాయి ధరమ్ తేజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ”ఇంట్లో వాళ్లు పెళ్లి చేసెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేస్తుంటే సంబంధాలు చూడమని మాత్రం చెప్పాను. అంతకుమించి నా పెళ్లిపై ఏదీ ముందుకు జరగలేదు. ప్రస్తుతానికైతే పెళ్లి పై పెద్దగా ఆలోచన లేదు. అమ్మాయి బాగా నచ్చితే అప్పుడు ఆలోచిస్తాను” అని పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు. సినిమాల విషయానికొస్తే సాయి తేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. ‘ప్రస్థానం’ దేవా కట్ట దర్శకత్వంలో ఓ సినిమాని స్టార్ట్ చేసిన తేజ్.. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ మిస్టికల్ థ్రిల్లర్ లో నటించనున్నాడు.