కార్తీ ‘సుల్తాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్..!

0

కోలీవుడ్ హీరో కార్తీ తాను నటించే ప్రతీ సినిమాను టాలీవుడ్ లో కూడా విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ‘యుగానికొక్కడు’ ‘ఆవారా’ ‘ఖాకీ’ వంటి చిత్రాలతో తెలుగులో కూడా మార్కెట్ ఏర్పరచుకున్నాడు. కింగ్ నాగార్జునతో కలిసి నటించిన తెలుగు – తమిళ్ ద్విభాషా చిత్రం ‘ఊపిరి’ తో ఇక్కడ కూడా సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలో గతేడాది వచ్చిన ‘ఖైదీ’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి కార్తీ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో టాలెంటెడ్ హీరో కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”సుల్తాన్”. ‘రెమో’ ఫేమ్ బక్కియరాజ్ కణ్ణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ‘సుల్తాన్’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘సుల్తాన్’ పోస్టర్ లో కార్తీ నీట్ గా టక్ చేసుకొని చేతిలో పెద్ద కొరడా పట్టుకొని నిలబడి కోపంగా చూస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను అక్టోబర్ 26 ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ముందుగా ప్రకటించినప్పటికీ.. కాస్త లేట్ గా రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ చిత్రంలో కార్తీ సరసన లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ శాండిల్ వుడ్ లలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక కు ‘సుల్తాన్’ తమిళ్ డెబ్యూ మూవీ. ఈ చిత్రానికి వివేక్ మెర్విన్ సంగీతం అందిస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్ ప్రకాష్ బాబు – ఎస్.ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా వాయిపడిన ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభించి ఇటీవలే పూర్తి చేశారు. ‘సుల్తాన్’ సినిమా విడుదలపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.