అత్తారింట్లో దగ్గుబాటి రానా దసరా సెలబ్రేషన్స్…!

0

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా ఇటీవలే తన ప్రేయసి మిహికా బజాజ్ ని మూడు ముళ్ల బంధంతో ముడివేసుకున్నాడు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు అతి కొద్దిమంది అతిథులు సన్నిహితుల మధ్య రానా – మిహిక ల వివాహ వేడుక ఆగష్టు 8న జరిగింది. పెళ్ళైన తర్వాత వచ్చిన దసరాను రానా – మిహిక బజాబ్ ల జంట ఘనంగా జరుపుకున్నారు. పెళ్లైన తరువాత ఇదే మొదటి పండుగ కావడంతో రానా అత్తవారింట్లో ఈ వేడుకలను చేసుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం అత్త-మామ లతో కలిసి రానా తన సతీమణి మిహిక ఫోటోలు దిగారు.

దసరా వేడుకలకు సంబంధించిన ఫోటోలను రానా అత్తయ్య బంటీ బజాజ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ ఫోటోలలో వైలెట్ కలర్ అండ్ హాఫ్ వైట్ డ్రస్ ధరించి.. దానికి తగ్గట్టుగా జ్యూవెలరీని ధరించి మిహికా సంప్రదాయబద్ధంగా కనిపించింది. ఇక రానా ఎప్పటిలాగే తన స్టైలిష్ లుక్ లో వైట్ కుర్తా మరియు జీన్స్ ధరించి కనిపిస్తున్నాడు. కాగా రానా ప్రస్తుతం వేణు ఉడుగుల దర్శకత్వంలో ‘విరాట పర్వం’ అనే సోషల్ డ్రామాలో నటిస్తున్నాడు. అలానే తెలుగు తమిళ హిందీ భాషల్లో ‘అరణ్య’ అనే పాన్ ఇండియా మూవీని పూర్తి చేసిన రానా.. 2021 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అంతేకాక గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్యకశ్యప’ అనే భారీ బడ్జెట్ సినిమాని కూడా రానా లైన్లో పెట్టాడు.