యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Pics.

తెలుగునౌ.కాం 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

గ్లామర్ కి గ్రహణమేనా.. మరీ ఇంతలానా… ?

0

ఎంత చెప్పుకున్నా సినిమా జీవితం ఎపుడూ కాదు జీవితాన్ని అది పూర్తిగా ప్రతిబింబించలేదు. సమాజంలో జరిగిన ఘటనలకు కొన్ని సార్లు అద్దం పడితే పట్టవచ్చు కానీ సినిమా అన్నది ఎపుడూ కృతకమే. అందుకే దానికి అంత మోజు. ప్రతీ మనిషికీ ఊహాలోకం ఉంటుంది. అలాంటి లోకాన్ని కళ్ళ ముందు ఆవిష్కరింపచేసే అద్భుత ప్రయత్నమే సినిమా మాధ్యమం. అలాంటి సినిమాలో గ్లామర్ ఉండాలి. యాక్షన్ ఉండాలి. మనిషి నిజ జీవితంలో ఏం చేయలేడో అన్నీ ఉండాలి. అపుడే అక్కడ పంట పండుతుంది.

అయితే ఇపుడు జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు చూస్తే నాచురల్ గా ఉండాలన్న ఆలోచనలతో మరీ డీ గ్లామరైజ్డ్ గా కొన్ని పాత్రలను తీర్చిదిద్దుతున్నారు. సహజత్వానికి ఎపుడూ మెచ్చుకోలు ఉంటుంది.

కానీ అది శృతి మించితేనే ఎబ్బెట్టు అవుతుంది. గ్లామరస్ ఉంటూ సొగసు సెగలను విరజిమ్మే కొంత మంది నటీమణుల చేత డీ గ్లామర్ రోల్స్ చేయిస్తే అది కమర్షియల్ గా ఎంత వరకూ వర్కౌట్ అవుతుంది అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. సినిమాలను నిలబెట్టేదే గ్లామర్ యాంగిల్.

అటువంటి సినిమాలలో సహజత్వం పేరిట అందమైన అమ్మాయిలను కూడా రఫ్ గా రగ్డ్ గా చూపిస్తున్నారు. అయితే సహజంగా చూపించడం వేరు. మనకు అలా చూపించడానికి అద్భుత దర్శకుడు బాపు ఉన్నారు. ఆయన సినిమాల్లో మేకప్ కి పెద్దగా చాన్స్ ఉండదు. గోరంత దీపం మూవీలో వాణిశ్రీని చూసినా ముత్యాల ముగ్గులో సంగీతను చూసినా అందంగా ఉంటారు అనే భావన ఆడియన్స్ కి కలుగుతుంది. అదే టైమ్ లో వారికి మేకప్ ఉండదు అలాగని డీ గ్లామర్ గా ఉంచలేదు.

కానీ ఇపుడు వస్తున్న కొన్ని సినిమాల్లో మేకర్స్ మాత్రం బబ్లీగా ఉన్న స్టార్ హీరోయిన్ల చేత కూడా పాత్ర డిమాండ్ పేరుతో డీ గ్లామర్ క్యారక్టర్స్ చేయిస్తున్నారు. దీనిని ఆడియన్స్ ఎంతవరకూ రిసీవ్ చేసుకుంటారు అన్నది చూడాలి. ఆఫ్ బిట్ మూవీస్ అయితే ఆ స్టైలే వేరుగా ఉంటుంది. అక్కడ కంటెంట్ కట్టి పడేస్తుంది కాబట్టి గ్లామర్ అన్న ప్రశ్నకు తావు ఉండదు కానీ ఫక్తు కమర్షియల్ ఫారెంట్ లో సినిమా తీస్తూ డీ గ్లామర్ రోల్స్ చేయించడం అంటే రిస్క్ చేస్తున్నారనే అనుకోవాలి.

పుష్ప మూవీలో యాంకర్ అనసూయ ద్రాక్షాయణి పాత్ర అలాగే ఉంది అన్న కామెంట్స్ అయితే ఉన్నాయి. ఇక ఇదే మూవీలో రష్మిక కూడా డీ గ్లామర్ రోల్ నే పోషిస్తోంది. ఇదే కోవలో మరిన్ని మూవీస్ వస్తున్నాయి. పుష్ప దర్శకుడు సుకుమార్ అయితే కధతో అట్రాక్ట్ చేస్తాడు పాత్రలను కూడా అందులో భాగంగానే అల్లుకుంటాడు కాబట్టి రంగ స్థలం మూవీ హిట్ అయింది. అందులో సమంత కూడా డీ గ్లామర్ గానే కనిపించినా అలరించింది. మరి ఇదే తరహా ప్రయోగాలు మిగిలిన వారు చేస్తే మాత్రం భారీ రిస్క్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు. ఏది ఏమైనా అతి ఎపుడూ ఇబ్బందే. ప్రత్యేకించి గ్లామర్ వరల్డ్ గా పేరున్న సినిమాలో దానికి పెద్ద పీట వేస్తేనే ముద్దూ ముచ్చటగా ఉంటుంది అంటున్నారు