ఇది నయన్ రేంజ్.. ఛార్టెడ్ ఫ్లైట్ లో షికారు

0

సౌత్ తో స్టార్ హీరోయిన్ నయనతార అనడంలో ఎలాంటి సందేహం లేదు. లేడీ సూపర్ స్టార్ అంటూ తమిళ మరియు తెలుగు ఆడియన్స్ తో అనిపించుకున్న ముద్దుగుమ్మ నయనతార ఒక్కో సినిమాకు మూడు నుండి ఆరు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటూ సౌత్ లోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా నిలిచింది. ఈమె చేసే లేడీ ఓరియంటెడ్ సినిమాలు మంచి ఆధరణ దక్కించుకుంటున్నాయి. సౌత్ లో అత్యధిక సంపాదన కలిగి ఉన్న హీరోయిన్ నయనతార అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె తన సంపాదనకు తగ్గట్లుగానే చాలా రాయల్ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి నెలకు ఒక ఫారిన్ హాలీడే ట్రిప్ వేస్తూ ఉంది. కరోనా కారణంగా ఈమద్య కాస్త తగ్గింది కాని అంతకు ముందు రెగ్యులర్ గా విదేశీ ప్రయాణాలు చేసేది.

ఇక ఇప్పుడు విదేశాలకు వెళ్లకున్నా ప్రియుడు విఘ్నేష్ తో కలిసి తన సొంత రాష్ట్రం కేరళకు అలాగే గోవా ఇతర హాలీడే స్పాట్ లకు వెళ్తుంది. ఇటీవల గోవా వెళ్లిన ఈ జంట చెన్నై నుండి ప్రత్యేక విమానంలో వెళ్లడం.. మళ్లీ ప్రత్యేక విమానంలో వెనక్కు రావడం జరిగింది. చాలా పెద్ద స్టార్స్ మాత్రమే ఛార్టెడ్ ఫ్లైట్ లో తిరుగుతూ ఉంటారు. కరోనా భయం కారణంగా ఇతరులతో ప్రయాణించడం రిస్క్ గా భావించి కేవలం తమ ఇద్దరి కోసం నయన్ ఏకంగా ఛార్టెడ్ ఫ్లైట్ ను బుక్ చేసింది. ప్రస్తుతం ఆమె రేంజ్ ఇది అంటూ చార్టెడ్ ఫ్లైట్ ప్రయాణమే చెప్పకనే చెబుతోంది. పెళ్లి చేసుకోకుండానే గత మూడు నాలుగు సంవత్సరాలుగా వీరిద్దరు కలిసి ఉంటున్నారు. పెళ్లి విషయంలో ఇప్పట్లో వీరు స్పష్టత ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే నయన్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్. పెళ్లి చేసుకుంటే ఆఫర్లు తగ్గుతాయేమో అనే ఉద్దేశ్యంతో పెళ్లి ఇప్పుడే వద్దనుకుంటుంది అంటూ మీడియా వర్గాల్లో ఊహాగాణాలు వినిపిస్తున్నాయి.