‘వకీల్ సాబ్’ పునః ప్రారంభం.. పవన్ ఎంట్రీ కాస్త ఆలస్యం

0

ఆరు ఏడు నెలలుగా షూటింగ్స్ కు దూరంగా ఉన్న స్టార్స్ పలువురు ఈ నెలలో కెమెరా ముందుకు వచ్చారు.. ఇంకా వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈనెలలో చిన్నా పెద్ద సినిమాలు చాలా వరకు షూటింగ్స్ పునః ప్రారంభం అయ్యాయి. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా కూడా షూటింగ్ ప్రారంభం అయ్యింది. నిన్న రాత్రి నుండి ఈ సినిమా షూటింగ్ ను జరుపుతున్నట్లుగా సినీ వర్గాల వారి ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతానికి రాత్రి సమయంలో షూటింగ్ చేస్తున్నాడు. పవన్ లేకుండానే షూటింగ్ జరుగుతోంది. కీలక నటీనటులతో ప్రస్తుతం కోర్టుకు సంబంధించిన చిత్రీకరణ జరుపుతున్నారు.

వకీల్ సాబ్ చిత్రీకరణలో వచ్చే నెల మొదటి లేదా రెండవ వారం నుండి పవన్ కళ్యాణ్ పాల్గొంటాడట. ఆయన వచ్చే లోపు ఇతర సీన్స్ దాదాపు అన్ని కూడా పూర్తి చేయాలని దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పై ఇప్పటికే కోర్టు సన్నివేశాలు చిత్రీకరించారు. ఇంకా వారం రోజుల పాటు కోర్టు సన్నివేశాలు ఆ తర్వాత శృతి హాసన్ తో కొన్ని సన్నివేశాలు మరియు ఒక పాటను ఒక ఫైట్ ను చిత్రీకరిస్తే మొత్తం సినిమా పూర్తి అయినట్లే అంటూ యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. నవంబర్ వరకు సినిమా షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ కు మొదటి కాపీని రెడీ చేస్తానంటూ దర్శకుడు వేణు శ్రీరామ్ చెప్పాడు.

దర్శకుడు చెప్పినట్లుగానే షూటింగ్ ఈ నెలలో ప్రారంభించారు కనుక వచ్చే నవంబర్ వరకు షూటింగ్ పూర్తి చేసే అవకాశం ఉందని డిసెంబర్ వరకు విడుదలకు సిద్దం చేసి జనవరిలో సంక్రాంతికి వకీల్ సాబ్ ను దించే అవకాశం ఉందనిపిస్తుంది. బాలీవుడ్ పింక్ కు వకీల్ సాబ్ రీమేక్ అనే విషయం తెల్సిందే. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేసి వకీల్ సాబ్ రూపొందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా సమ్మర్ లోనే విడుదల అవ్వాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా వేయడం జరిగింది.