చనిపోవడానికి ముందు ఆపదలో ఉన్నట్లు చెప్పిన సుశాంత్!?

0

బాలీవుడ్ హీరో సుశాంత్ మృతికి సంబంధించిన అనుమానాలకు మరియు ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికి లభించడం లేదు. దాదాపు మూడు నెలలుగా సుశాంత్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. సీబీఐ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయినా ఇప్పటి వరకు ఒక కొలిక్కి కేసు రాలేదు. రోజుకో కొత్త విషయం ఈ కేసు గురించి బయటకు వస్తున్న నేపథ్యంలో రకరకాలుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుశాంత్ చనిపోవడానికి ముందు తన సోదరితో చేసిన ఛాటింగ్ కు సంబంధించి ఇప్పుడు ఒక విషయం బయటకు వచ్చింది అంటూ జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

జాతీయ మీడియా కథనం ప్రకారం సుశాంత్ మృతికి కొన్ని రోజుల ముందు తన సోదరి మీతూ సింగ్ కు ఎస్ ఓ ఎస్ లో భయంగా ఉంది. నన్ను చంపేస్తారేమో అనిపిస్తుంది. నన్ను ఏదో ఒక దాంట్లో వారు నన్ను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో నీతో మాట్లాడాలని ఉంది అంటూ పేర్కొన్నాడట. ఆ సమయంలో ఆయన్ను మానసికంగా చాలా హింసించారని వారు ఎవరు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది అంటూ ప్రముఖ జాతీయ మీడియా ఒక కథనంలో పేర్కొంది. ఆ ఒత్తిడి కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడు లేదంటే ముందుగా ఎవరి వల్ల అయితే ప్రమాదం ఉందని సోదరికి చెప్పాడో వారే సుశాంత్ ను చంపేసి ఉంటారేమో అంటూ జాతీయ మీడియా వర్గాల వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.