ప్రభాస్ మూవీకి లెజెండ్రీ డైరెక్టర్ కు సంబంధం ఏంటీ?

0

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ తో పాటు ఆదిపురుష్ ఇంకా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. మొత్తం మూడు సినిమాల్లో ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా కాన్సెప్ట్ క్లారిటీ వచ్చేసింది. ఇక ఆదిపురుష్ గురించి మొత్తం క్లారిటీ ఇచ్చేశారు. కాని మహానటి ఫేం నాగ్ అశ్విన్ మాత్రం సినిమా గురించి చాలా సస్పెన్స్ లో ప్రేక్షకులను ఉంచాడు. భారీ సోషియో ఫాంటసీ సినిమా అంటూ దర్శకుడు ఇప్పటికే చెప్పాడు.

వైజయంతి మూవీస్ బ్యానర్ లో రాబోతున్న మరో అద్బుత దృశ్య కావ్యం అంటూ చాలా నమ్మకాలు పెంచుతున్నారు. ఇలాంటి సమయంలో సినిమాలో దీపిక పదుకునే హీరోయిన్ అంటూ సినిమా స్థాయిని పెంచారు. తాజాగా ప్రముఖ లెజెండ్రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు బర్త్ డే సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన్ను ఈ ప్రాజెక్ట్ లోకి ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ వైజయంతి మూవీస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ చేయడం జరిగింది.

ప్రభాస్ మూవీకి ఈ లెజెండ్రీ డైరెక్టర్ కు సంబంధం ఏంటీ అంటూ చర్చ మొదలైంది. సింగీతం ఇప్పటి వరకు ఎన్నో దృశ్య కావ్యాలను ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ మూవీస్ మరియు సోషియో ఫాంటసీ చిత్రాలను తెరకెక్కించారు. కనుక ఆయన అనుభవంను ఆయన క్రియేటివిటీని ఈ సినిమాకు ఉపయోగించుకుంటున్నారా లేదంటే ఆయన గతంలో తీసిన సినిమాల్లో నుండే ఒక సినిమాను రీమేక్ లేదా ఫ్రీమేక్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఆధిత్య 369 కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతుంది అనే పుకార్లు షికార్లు చేశాయి. ఈ పరిణామంతో అవి నిజమేనేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. అసలు విషయం ఏంటీ అనేది యూనిట్ సభ్యులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.