Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆటోలో తిరుగుతూ 25 ఏళ్ల వేడుక చేసుకున్నారు

ఆటోలో తిరుగుతూ 25 ఏళ్ల వేడుక చేసుకున్నారు


వెంకటేష్ హీరోగా, ప్రీతి జింటా హీరోయిన్‌ గా జయంత్‌ సి పరాన్జీ దర్శకత్వం లో వచ్చిన ప్రేమంటే ఇదేరా సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈతరం ప్రేక్షకులకు ఆ సినిమా గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 1970 మరియు 1980 కిడ్స్ ఆ సినిమాను ఏ స్థాయిలో సక్సెస్ చేశారో సాధించిన వసూళ్లను బట్టి అర్థం చేసుకోవచ్చు.

వెంకటేష్ తో పాటు హీరోయిన్ ప్రీతి జింటా ల స్టార్‌ డమ్‌, స్థాయి రెట్టింపు అవ్వడం లో ఆ సినిమా ప్రధాన పాత్ర పోషించింది. జయంత్ సి పరాన్జీ కూడా తెలుగు లో టాప్ దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా విడుదల అయ్యి పాతిక సంవత్సరాలు పూర్తి అయింది. ప్రేమంటే ఇదేరా సినిమా పాతకేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యం లో సోషల్‌ మీడియాలో సందడి చేశారు.

హీరోయిన్ ప్రీతి జింటాతో కలిసి దర్శకుడు జయంత్ సి పరాన్జీ ముంబై వీధుల్లో ఆటోలో తిరుగుతూ గత జ్ఞాపకాలను నెమరవేసుకున్నాడు. హీరోయిన్ మరియు దర్శకుడు ఇద్దరూ కూడా ప్రేమంటే ఇదేరా సినిమా పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్‌ మీడియా ద్వారా తమ ఆనందాన్ని పంచుకున్నారు.

వెంకటేష్ మాత్రం ఈ పాతికేళ్ల వేడుకలో పెద్దగా కనిపించలేదు. ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమా తో బిజీగా ఉన్నాడు. ప్రీతి జింటా ఈ మధ్య కాలంలో సినిమాలు తగ్గించింది. దర్శకుడు సక్సెస్ లు లేకున్నా కూడా సినిమాలు చేస్తూ ప్రయత్నాలు కంటిన్యూ చేస్తున్నాడు.