Templates by BIGtheme NET
Home >> Cinema News >> మార్కెట్ లో త్రిష సంచ‌ల‌నానికి కార‌ణం అదే

మార్కెట్ లో త్రిష సంచ‌ల‌నానికి కార‌ణం అదే


అందాల త్రిష పేరిప్పుడు ఎక్క‌డా చూసినా మార్మోగుతోంది. `పొన్నియ‌న్ సెల్వ‌న్` సిరీస్…`లియో` విజ‌యాల‌తో అమ్మ‌డు హాట్ టాపిక్ గా మారింది. వీటికి తోడు బ్యూటీ విష‌యంలో అంత‌కంత‌కు క‌వ్వించే స్తుంది. వ‌య‌సు ముదిరినా అందం మాత్రం త‌ర‌గ‌లేదు. న‌వ నాయిక‌లా ఆక‌ట్టుకుంటుంది. దాదాపు రెండు ద‌శాబ్ధులుగా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. మ‌ధ్య‌లో వ‌రుస ప‌రాజయాలు ఇబ్బంది పెట్టినా? కొత్త నాయిక‌ల నుంచి గ‌ట్టి పోటీ ఎదురైనా ఎక్క‌డా నెర‌వ‌లేదు.

అదే ఆత్మ విశ్వాసంతో నిల‌బ‌డి అవ‌కాశాలు అందిపుచ్చుకుంది. తాజాగా ఈ ప్ర‌యాణాన్ని ఉద్దేశించి లియో విజ‌యోత్స‌వంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. `లోకేశ్‌ కనకరాజ్‌ నన్ను కలిసినప్పుడు ఏం చెప్పారో? అదే తెరపై ఆవిష్కరించారు. విజయ్‌ సరసన నటించడం మరిచిపోలేని అనుభవం. స్కూల్లో ఫ్రెండ్స్‌ కొన్నేళ్ల తర్వాత కలిస్తే ఎలా ఉంటుందో అలాంటి అనుభూతి నాకు కలిగింది. నా కెరీర్‌లో ఎక్కువ చిత్రాలు చేసింది విజయ్‌తోనే.

విజయ్‌ నెమ్మదితనం.. సింప్లిసిటీ ఆయన విజయానికి కారణం. నా స్నేహితులు విజయ్ తో మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తావని కలిసిన ప్రతిసారీ అడుగుతారు. `లియో`తో అది ఇన్నాళ్లకు జరిగింది. 15 ఏళ్ల తర్వాత కూడా మా కాంబినేషన సక్సెస్‌ఫుల్‌గా వర్కవుట్‌ అయింది. సాధార‌ణంగా హీరోయిన్స్ కి పతనాలు ఎక్కువగా ఉంటాయి. ఇండ‌స్ట్రీలో లాంగ్ లైఫ్ చాలా త‌క్కువ మందికే ఉంటుంది.

ఆ విష‌యంలో నేను ల‌క్కీ. కొన్ని ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదురైనా అన్నివేళలా సంతోషంగా ఉండాలి అన్న‌ది నా సంక‌ల్పం. నేను అదే చేసాను. అలా ఉండటం వల్లే నా స్థానాన్ని నిలబెట్టుకుని ఈ స్థాయిలో ఉన్నాను` అని అన్నారు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీకి తెలుగులోనూ అవ‌కాశాలు బాగా వ‌స్తున్నాయి. సీనియ‌ర్ హీరోల వ‌య‌సును ప‌ర్పెక్ట్ గా మ్యాచ్ చేయ‌గ‌ల‌దు. చిరంజీవి..నాగార్జు..వెంక‌టేష్‌..బాల‌య్య లాంటి హీరోల‌కు మంచి జోడీగా నిలుస్తుంది.