`అద్దం` ట్రైలర్ టాక్

0

మూడు జంటలు ..బతుకులో ఎమోషన్.. ఎఫైర్ల కహానీ.. ఇలాంటి వేడెక్కించే కంటెంట్ తో ఆహా ఓహో అనిపించేలా! తెరకెక్కించారా? అంటే అవుననే అర్థమవుతోంది ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూశాక. ఈ లాక్ డౌన్ సీజన్ లో `ఆహా` ఓటీటీలో చాలా సినిమాలు .. వెబ్ సిరీస్ లు రిలీజయ్యాయి. కానీ వేటికీ పాజిటివ్ స్పందన అయితే కనిపించలేదు. క్రిటిక్స్ నుంచే కాదు ఆడియెన్ నుంచి కూడా సరైన రివ్యూలు రాకపోవడంతో డైలమా తప్పలేదు. అయినా అరవింద్ అండ్ టీమ్ ఎంతో పట్టుదలగా నిరంతరాయంగా కంటెంట్ ని వండి ఆడియెన్ కి అందిస్తున్నారు.

ఇన్నోవేషన్ కోసం క్రియేటివిటీ కోసం నిరంతరం తపిస్తున్నారు. ఆహా నుంచి వస్తున్న తాజా వెబ్-సిరీస్ ‘అద్దం’. వన్ థీమ్ త్రీ స్టోరీస్! అంటూ కథేంటో చెప్పేశారు ట్యాగ్ లైన్ తోనే. మూడు కథల్లో ఎఫైర్ల వ్యవహారం చూపిస్తున్నారా? అన్నది ట్రైలర్ లో మార్మికంగా కనిపిస్తోంది. ఆ మూడు జంటల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? అన్నది సస్పెన్స్ ఎలిమెంట్. లైఫ్ ని ఎలా ఎదుర్కోవాలో స్వీయ ప్రతిబింబం ప్రయాణం తదనుగుణంగా టైటిల్ ని నిర్ణయించారట. ట్రైలర్ ఆద్యంతం భావోద్వేగాలతో నిండిన భార్యాభర్తల సంఘర్షణలతో నిండి ఉంది.

ప్రసన్న-వరలక్ష్మి శరత్కుమార్ – కిషోర్ – రోహిణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిగా.. ఇందులో ప్రతి కథకు వేర్వేరు దర్శకులు పని చేశారు. తెలుగు- తమిళ నటీనటులు ఇందులో కనిపిస్తున్నారు. అక్టోబర్ 16 నుంచి ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఎఫైర్లు అంటే రక్తి కట్టించుకుండా ఉంటాయా? ఓటీటీల్లో నిరంతరం తలమునకలుగా ఉండే యూత్ కి గాలం వేసేందుకే ఈ ప్రయత్నం అని అర్థమవుతోంది. మరి ఏమేరకు సక్సెస్ సాధిస్తుంది? అన్నది వేచి చూడాలి.