Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆదిపురుష్ Vs రామసేతు.. మత వివాదాలు తప్పవా?

ఆదిపురుష్ Vs రామసేతు.. మత వివాదాలు తప్పవా?


అప్పట్లో రామానంద్ సాగర్ `రామాయణం` తీస్తే గొప్పగా ఆదరించారు. రాముడే ఇంటికొచ్చాడంటూ పొగిడేశారు. కానీ ఇప్పుడు రాముడిపైనే సినిమా తీయాలనుకుంటే మనోభావాలు దెబ్బ తింటున్నాయని హిందూయిజం అతి ఎక్కువైందని కత్తులు దూస్తున్నారు. ఇదోరకం ఆధునిక పైత్యమని హిందూయిజాన్ని నాశనం చేయడమని హిందూవాదులు వాదిస్తున్నారు.

ఇక రాముడు రావణాసురుడు అంటూ సినిమాలు తీస్తే వివాదాలు సృష్టించేందుకు ఓ సెక్షన్ రాజకీయ పార్టీలు రెడీ గా ఉన్నాయన్న చర్చా వేడెక్కిస్తోంది. దీనిపై ఇప్పటికే జాతీయ మీడియాలో కథనాలు హైలైట్ అవుతున్నాయి.

ఇక లంకకు త్రేతాయుగానికి లింకప్ చేస్తూ రామాయణ కథను రామసేతు పేరుతో అభిషేక్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో అక్షయ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇక `ఓం` పేరుతో ఆదిత్య కపూర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ టైటిల్లోనే మత వివాదం దాగి ఉందని గొడవ మొదలైంది.

నిజానికి మతాన్ని టచ్ చేస్తే వివాదం చెలరేగడం అన్నది ఇప్పటిది కాదు. ఇంతకుముందే మణిరత్నం మతకల్లోలాల నేపథ్యంలో బొంబాయి సినిమా తీసినప్పుడు తీవ్రమైన ఘర్షణలు చెలరేగాయి. ఒకానొక సందర్భంలో మణిరత్నం ఇంటిని తగులబెట్టేయడం సంచలనమైంది.

ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ పద్మావత్ 3డి విషయంలోనూ ఈ తరహా వేధింపుల్ని ఎదుర్కొన్నారు. రాజ్ పుత్ రాణిని హిందూ దేవతల్ని హైలైట్ చేస్తూ ఒక వర్గాన్ని కించపరుస్తున్నారని దర్శకుడు భన్సాలీపైనే దాడులకు తెగబడడం కలకలం రేపింది. సెట్లో నిప్పంటించేసి నానా యాగీ చేసారు ఒక సెక్షన్ జనం. ఉత్తరాదిన ఇలాంటి వాటికి డబ్బు తీసుకుని గొడవలు చేసే ఒక సెక్షన్ ఉందన్న కథనాలు వెలువడ్డాయి అప్పట్లో.

కాన్సెప్టుల్లో దేవుళ్లు .. మతాలతో రిస్కులు.. ఎంత? అన్న చర్చ ప్రతిసారీ జరుగుతూనే ఉంది. సరిగ్గా ఇలాంటి టైమ్ లో ప్రభాస్ కథానాయకుడిగా ఓంరౌత్ `ఆదిపురుష్ 3డి`ని ప్రారంభించారు. ఇందులో మెలూహా తరహా పాత్రచిత్రణను మిక్స్ చేసిన శ్రీరాముడిగా ప్రభాస్ నటిస్తారని కథనాలు రావడంతో ఇది కాస్తా చర్చల్లోకొచ్చింది. శ్రీరాముడు హిందూయిజం అంటే ఒక సెక్షన్ మళ్లీ వివాదాలు రాజేసేందుకు రెడీగా ఉంటుంది. అలాంటప్పుడు ప్రభాస్ – ఓంరౌత్ టీమ్ చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుందని స్క్రిప్టులోనే వివాదాల్లేకుండా చూడాలని అభిమానులు కోరుతున్నారు. అలాగే అభిషేక్ శర్మ `రామసేతు` ఈ తరహా వివాదాలకు తావిచ్చే ఛాన్సుందని భావిస్తున్నారు. పాన్ ఇండియా కేటగిరీలో వస్తున్న ఈ సినిమాలకు వివాదాలతో కావాల్సినంత పబ్లిసిటీ వస్తున్నా.. రిలీజ్ ముంగిట నసలా పంటికింద రాయిలా మారితేనే ప్రాబ్లెమ్. అందుకే మేకర్స్ కాస్త జాగ్రత్త వహిస్తారనే ఆశిస్తున్నారు. ఇక అయిన దానికి కాని దానికి వివాదం రాజేసే ఓటు బ్యాంకు రాజకీయాల్ని తిట్టిపోసేవాళ్లు అంతకంతకు పెరుగుతున్నారు.