అదితీ యోగా భంగిమ చూస్తే హఠయోగికైనా ముచ్చెమటలే!

0

యోగా ధ్యానం అనేవి పరమాత్మను చేరుకునే మంచి మార్గాలు అని ఎవరు చెప్పారు? యోగాని యోగా భంగిమల్ని నాడు రుషులు రుషి పుంగవులు ఎందుకని అలా డిజైన్ చేశారో కానీ… నేడు ఇదిగో ఇలా కొందరు తమ స్వార్థానికి నచ్చినట్టు డిజైన్ చేసుకుని అమాయక జనాన్ని వెర్రెత్తిస్తున్నారు.

ఫ్యాషన్ ప్రపంచపు పెను పోకడల్లో ఇలాంటివి ఎన్నో బయటపడుతూనే ఉన్నాయి నిత్యం. తాజాగా అదితీరావ్ హైదరీ ప్రఖ్యాత కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఫోజు అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. సౌత్ లో ఫేమస్ అవుతున్న కొద్దీ ఈ అమ్మడు చెలరేగిపోతోందిలా.

ఇంతకీ ఈ యోగా భంగిమను ఏమని పిలుస్తారో అదితీనే చెప్పాలి. చారెడేసి కళ్లతో చారల గుర్రం తలకిందులుగా వేసిన అసనంలా ఏమిటీ చిద్విలాస యోగం? అసలు అదితీ ఫీట్ చూస్తే.. హఠయోగి అయినా శృంగార పురుషుడిగా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు సుమీ!

ఇటీవలే సూఫీయుం సుజాతయుం అంటూ హిందూ – ముస్లిమ్ ప్రేమకథలో జీవించేసిన అదితీరావ్ మునుముందు అలాంటి ప్రయోగాలెన్నిటికో రెడీ అవుతోంది. ది గ్రేట్ మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ హిస్టారికల్ మూవీలోనూ అదితీ నటిస్తోంది. తాజా కాస్మోపాలిటన్ మ్యాగజైన్కు ఆమె కవర్ షూట్ తో అదితీ ఇమేజ్ మరింత పెరగనుంది. ఏదేమైనా కాస్మోపాలిటన్ కాలిపోతోందిలా!