లైఫ్ ని వంద శాతం తనకి నచ్చినట్టే ఆస్వాధిస్తోందట

0

లేడి కూన అలసి సొలసి సేద తీరుతున్నట్టుగా.. అలా రిలాక్స్ డ్ గా కూచుందేమిటో! శర్మాగాళ్ ఇటీవల స్పోర్ట్స్ క్వీన్ గా మారిపోయి అదిరిపోయే ట్రీటిస్తోంది. నిరంతరం ఫిట్నెస్ జిమ్ ల చుట్టూ తిరిగేస్తూ… అలాగే క్రీడల్లోనూ తలమునకలై వీలైనన్ని భంగిమలతో రకరకాల ఫోటోషూట్లతో దుమారం రేపుతోంది.

టైట్ ఫిట్ స్పోర్ట్స్ బ్రా.. స్పోర్ట్ ట్రాక్.. చేతిలో ఆ క్యాప్ చూస్తుంటే ఎక్కడో రైడ్ కి వెళ్లి వచ్చినట్టే కనిపిస్తోంది. సైకిల్ రైడ్ బైక్ రైడ్ అంటే ఐషా శర్మకు చాలా చాలా ఇష్టం. స్టఫ్ పుచ్చుకునే కంటే తయారు చేసుకోవడమే ఉత్తమం. బైక్ లైఫ్ వందశాతం విజయవంతంగా సాగుతోంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అలాగే చేతిలో క్యాప్ బ్రాండ్ కి ప్రచారం చేయడం కనిపిస్తోంది కదూ?

మొత్తానికి ఈ ప్రకటనతో లక్షల్లో వెనకేసుకుంటున్నట్టే కనిపిస్తోంది. నేహాశర్మ- ఐషా శర్మ సిస్టర్స్ బాలీవుడ్ లో ఎదిగేందుకు ఎంతో తపిస్తున్నా.. ఇంకా రేసులో వెనకబడే ఉన్నారు. ఇటీవల కాస్త బెటర్ ఆఫర్స్ వస్తున్నాయి. ఐషా శర్మ మీడియం రేంజ్ బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.