టాలీవుడ్ హీరోతో ఇస్మార్ట్ బ్యూటీ డేటింగ్ నిజమేనా?

0

లాక్ డౌన్ వల్ల ప్రపంచం మొత్తం మారిపోయింది. కొత్త అలవాట్లని నేర్చుకుంది. కొత్త జీవన విధానాన్ని నేర్పించింది. గత ఏడు నెలల కాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా మారారు మారుతున్నారు కూడా. లాక్ డౌన్ సమయంలో ఇంటి నుంచి కాలు బయట పెట్టడానికి ఎవరూ ఇష్టపడలేదు. ఇంట్లోనే వుంటూ తమకు తోచినవి చేస్లూ కాలక్షేపం చేశారు.

కొంత మంది సెలబ్రిటీలు మాత్రం వంటలు… వర్కవుట్లతో ఫుల్ బిజీగా గడిపేశారు. కొంత మంది ఇదే మంచి తరుణం అంటూ పెళ్లిళ్లకు రెడీ అయిపోయారు. లాక్ డౌన్ టైమ్ లో నిఖిల్.. దిల్ రాజు… నితిన్.. రానా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇదే టైమ్ లో కొంత మంది డేటింగ్ కూడా మొదలుపెట్టారట. ఆ జాబితాలో ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా వుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఓ టాలీవుడ్ హీరోతో నిధిఅగర్వాల్ డేటింగ్ లో వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని నిధి కొట్టి పారేస్తోంది. తను ఎవరితో డేటింగ్ లో లేనని అదంతా అబద్ధమని చెబుతోంది. తెలుగులో నిధి రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఒకటి రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన చిత్రం.. మరోకటి అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం.