ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కి జోడీగా మరో భామ..?

0

రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ ఈ మధ్యే మళ్లీ మొదలైంది. కొమరంభీమ్ గా ఎన్టీఆర్ లుక్ రిలీజైంది కూడా. ఎన్టీఆర్ లుక్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఐతే ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కి జోడీగా బ్రిటన్ భామ ఒలివియా మోరిస్ కనిపించనుందని తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ పక్కన మరో హీరోయిన్ కూడా ఉంటుందని తెలుస్తుంది. కొమరం భీమ్ పాత్ర ఇంటి నుండి బయటకి వెళ్ళే ముందు తనకి మరదలు ఉంటుందట. ఆ మరదలు పాత్రలో ఒక హీరోయిన్ ని తీసుకోవాలని చూస్తున్నారట.

ఆ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ ఐతే బాగుంటుందని అనుకుంటున్నారట. తెలుగులో ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కించుకుంటున్న ఐశ్వర్యా రాజేష్, తమిళంలో చాలా సినిమాల్లో నటించింది. పల్లెటూరి అమ్మాయిగా ఐశ్వర్యా రాజేష్ సరిగ్గా సరిపతుందని, అందువల్లే ఆమెని ఎంచుకున్నారని వినిపిస్తుంది. గతంలో వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో ఆమె పాత్రకి మంచి పేరొచ్చింది. మరి ఈ వార్త నిజమా కాదా అన్నది చిత్ర బృందం అధికారికంగా స్పందిస్తే తప్ప తెలియదు.