కూతురు ఆరాధ్యపై ఐష్ ఎందుకంత ఎమోషనైంది?

0

మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన 47 వ పుట్టినరోజును ఆదివారం జరుపుకున్నారు. దీనిని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్న ప్రియాతి ప్రియమైన వారిలో భర్త అభిషేక్ బచ్చన్ .. కుమార్తె ఆరాధ్య ఉన్నారు. బచ్చన్ నివాసం `జల్సా`లో పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ఐష్-అభి దంపతులు స్వయంగా ఫోటోల్ని షేర్ చేయగా అవికాస్తా వైరల్ గా మారారు. అభిషేక్ తన సతీమణి ఐశ్వర్యకు హృదయపూర్వక పుట్టినరోజు సందేశాన్ని కూడా జత చేశారు.

ఇంట్లో వేడుకలే కాకుండా ఐశ్వర్య రాయ్ బచ్చన్ కి తన స్నేహితులు సహచరులు అయిన సోనమ్ కపూర్- కత్రినా కైఫ్- శిల్పా శెట్టి- అనుష్క శర్మ- అలియా భట్- హృతిక్ రోషన్- అనిల్ కపూర్ తదితరులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఎనిమిదేళ్ల ఆరాధ్య పై తన పుట్టినరోజు వేళ ఐశ్వర్య ట్వీట్ ఆసక్తిని కలిగించింది. “నా జీవితంలో సంపూర్ణ ప్రేమ.. ఆరాధ్య నా దేవదూత. నేను నిన్ను నిత్యంగా.. అనంతంగా .. బేషరతుగా ప్రేమిస్తున్నాను… ఎప్పటికీ“ అని 47 ఏళ్ల ఐశ్వర్యారాయ్ ఒక ప్రేమపూర్వక నోట్ ని రాసుకొచ్చింది.

బచ్చన్ కుటుంబంలో అమితాబ్.. అభిషేక్ .. ఆరాధ్య సహా ఐశ్వర్యకు ఇంతకుముందు కరోనావైరస్ పాజిటివ్ అని తేలాక.. ఆస్పత్రిలో చికిత్సతో బయటపడిన సంగతి తెలిసినదే.

కెరీర్ సంగతి చూస్తే.. ఐష్ చివరి సారిగా ఫ్యానీ ఖాన్ చిత్రంలో కనిపించింది. అనురాగ్ కశ్యప్ గులాబ్ జామున్ లో అభిషేక్ సరసన నటించనుంది. మణిరత్నం తదుపరి చిత్రం పొన్నీయిన్ సెల్వన్ లో ఐశ్వర్య కీలక పాత్ర పోషించనుంది.