డెడికేషన్ అంటే అదీ! గాయమైనా షూటింగ్కు వచ్చిన అజిత్!

0

తమిళ స్టార్ హీరో అజిత్ డెడికేషన్కు మారుపేరు. నిర్మాతలకు ఇబ్బందులకు కలుగకుండా తన షెడ్యూల్లో మార్పులు చేసుకుంటూ ఉంటారు. దీంతో అతడిని తమిళనాడులోని ప్రేక్షకులే కాక.. దర్శక నిర్మాతలు కూడా ఇష్టపడుతుంటారు. ఈ వయసులో కూడా మాస్ క్లాస్ జనాలను ఆకట్టుకుంటున్నారు. అయితే ఆయన నటిస్తున్న‘వాలిమై’ షూటింగ్ హైదరాబాద్ లో సాగుతుంది. ఈ క్రమంలో అజిత్ చేతికి గాయమైంది. దీంతో షూటింగ్ నిలిచి పోయింది. నెలరోజులపాటు షూటింగ్కు బ్రేక్ పడొచ్చని అంతా భావించారు. కానీ అజిత్ మాత్రం మర్నాడే షూటింగ్ లో పాల్గొని అందరినీ ఆశ్చర్య పరిచారు. అజిత్ సినిమా కోసం నిర్మాత బాగు కోసం గాయాలను కూడ లెక్క చేయకుండా సెట్స్ మీదకి రావడం తో అజిత్ ను చిత్ర యూనిట్ ప్రశంసించింది.

షూటింగ్ లో భాగంగా గాయపడటం అజిత్ కు ఇవాళ ఏమి కొత్తకాదు. డూపులు పెట్టి ఫైట్ సీన్స్ లాగించడం అజిత్ కు ఇష్టం ఉండదు. అందుకే రిస్క్ అయినా సరే పోరాట దృశ్యాల్లో స్వయంగా తానే పాల్గొంటూ ఉంటాడు. ఇలా చాలా సందర్భాల్లో అజిత్ గాయ పడ్డాడు. ప్రస్తుతం వాలిమై చిత్రం కోసం స్టంట్ కొరియోగ్రఫర్ దిలీప్ సుబ్రమణ్యం పర్యవేక్ష లో అజిత్ కొన్ని యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నాడు.

ఈ మూవీలో బాలీవుడ్ నటి హుమా ఖురేషి కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు యువ హీరో కార్తికేయ నెగెటివ్ రోల్ పోషిస్తున్నాడు. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2021 వేసవి కానుకగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ షెడ్యూల్ తర్వాత డిసెంబర్ మొదటి వారంలో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. 20 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ తరవాత ఇంకొక షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంటుంది. అజిత్ వినోత్ కాంబినేషన్లో వచ్చిన గత చిత్రం ‘నెర్కొండ పారవై’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.