స్టార్ హీరోయిన్ అక్కినేని ముద్దుల కోడలు సమంత ఈ ఏడాది అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్ ఇవ్వబోతోంది. `జాను` తరువాత మరో సినిమా లేకపోయినా.. సమంత త్వరలో సంచలనాల హిందీ వెబ్ సిరీస్ `ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2`తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సిరీస్ పై ఇప్పటికే భారీ క్రేజ్ ఏర్పడింది. రాజ్ ఎన్ డీకే తెరకెక్కిస్తున్న మచ్ అవైటెడ్ సిరీస్ కావడం.. ఇందులో సమంత నెగెటివ్ పాత్రలో కనిపించనుండటంతో ఈ సిరీస్ కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ ఏడాది డిసెంబర్ లో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అది వచ్చే ఏడాది ప్రధమార్థానికి మారింది. ఇందులో నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అనేంతగా సమంత పాత్ర కరుడు గట్టిన తీవ్రవాదిగా కనిపించి షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చేలా వుంటుందని తెలుస్తోంది. ఈ సిరీస్ కోసం చాలా రూల్స్ ని బ్రేక్ చేశానని సమంత చెప్పడంతో ఇందులో సామ్ పాత్ర ఓ రేంజ్లో షాక్ ఇవ్వడం గ్యారంటీ అంటున్నారు.
ఇదిలా వుంటే సమంత గేమ్ ప్లాన్ మారినట్టుగా తెలుస్తోంది. మునుపెన్నడూ ఊహించని విధంగా `ఆహా` కోసం `సామ్ జామ్` షోకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. భవిష్యత్ లో అక్కినేని ఓటీటీకి సామ్ చేస్తున్న ట్రైల్స్ లా వుందని అంతా అనుమానిస్తున్నారు. సమంత మైండ్ లోనూ ఇదే ఆలోచన వుందట. భారీ స్థాయిలో అక్కినేని ఓటీటీని ప్లాన్ చేసి ఓ రేంజ్ కి తీసుకెళ్లాలన్న ఆలోచన సమంతకు వుందట.