అంత పెద్ద స్టార్ ని వంటాయన్ని చేసి ఆడుకుంటున్న పెళ్లాం!

0

వరుస బ్లాక్ బస్టర్లతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే అరుదైన రికార్డుల్ని ఖాతాలో వేసుకుంటున్నాడు. ఫోర్బ్స్ జాబితాలో దిగ్గజాలైన స్టార్లెందరినో కిందికి తొక్కేస్తున్నాడు. ఏడాదికి 1000 కోట్ల సంపదతో సంచలనాలే సృష్టిస్తున్నాడు. అలాంటి టాప్ స్టార్ ని చూసి అసూయ పడే సాటి స్టార్లు ఉన్నారు. మరి అన్ని క్వాలిటీస్ ఉన్నా ఆయన కూడా పెళ్లాం కొంగు పట్టుకుని తిరగాల్సిందేనా? అంటే .. అవుననే తాజా సీన్ చెబుతోంది.

ఇంతకీ ఎవరా స్టార్ హీరో? అంటే .. ఇంకెవరు.. ఆయన కిలాడీ అక్షయ్ కుమార్. భార్యామణి ఎవరో చెప్పాలా? ది గ్రేట్ స్టార్ వైఫ్ ట్వింకిల్ ఖన్నా. రవీనా లాండన్ ని ప్రేమించి పెళ్లాడేయబోతున్నాడన్న పుకార్ల నడుమ సడెన్ ట్విస్టుతో ట్వింకిల్ ని పెళ్లాడాడు అక్షయ్. ఆ తర్వాత ఈ జంట ఆదర్శ జంటగా వెలిగిపోయింది.

ఇంట్లో అత్యుత్తమ కుక్ ఎవరు అని ఈ జంటను అడిగితే.. కనీసం ఆమ్లెట్ కూడా చేయలేనందున తాను ఉత్తమ వంటగాడినని అక్షయ్ చమత్కరించారు. ఆమె కథలు మాత్రమే ఉడికించగలదు అంటూ ట్వింకిల్ పైనా పంచ్ వేశారాయన. ఫిట్ నెస్ ఫ్రీక్ మరియు చాలా డైట్ స్పృహ ఉన్న అక్షయ్ ఆరోగ్యంగా ఉండటానికి వంట కూడా నేర్చుకున్నారట.

గొప్ప కుక్ అయిన అక్షయ్ తన పిల్లల కోసం ఇంట్లో చాక్లెట్ పరాఠా సిద్ధం చేస్తాడని అది ఎంతో ఆరోగ్యకరమైనది రుచికరమైనది అని ట్వింకిల్ అన్నారు. అక్షయ్ – ట్వింకిల్ కంటే కూడా వారసుడు ఇంకా మంచి చెఫ్ అట. ఆరవ్ ఇంట్లో ఉత్తమ చెఫ్ అని అక్కీ తెలిపాడు. రాజ్మా నుండి పిజ్జాల వరకు ఏదైనా వండేస్తాడని కితాబిచ్చేశాడు మరి. అక్షయ్ వంటను.. ఫ్యామిలీ లైఫ్ ని ఎంత జాయ్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడో తాజా ఇంటర్వ్యూ వెల్లడించింది.