Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఎయిర్ పోర్ట్ లో ఇక ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్ అని వినలేం’?

ఎయిర్ పోర్ట్ లో ఇక ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్ అని వినలేం’?


ఎయిర్ పోర్ట్స్ లో సాధరణంగా ప్యాసింజర్ల కు స్వాగతం పలుకుతూ .. ఎయిర్ లైన్స్ టీమ్ హల్లో..’లేడీస్ అండ్ జెంటిల్మెన్’ అంటూ పిలుస్తుంటారు. కానీ ఇకనుంచి ఆ మాటలని మార్చేయాలని జపాన్ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. జపాన్ లోని విమానాశ్రయాల్లో ఇకపై అలా పిలవకూడదు. ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులకు లింగ వయసు జాతి ప్రాంతీయ భేదం లేని వాతావరణం కల్పించాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగానే జపాన్ ఎయిర్ లైన్స్ స్త్రీ పురుష లింగ భేదాన్ని ఎత్తిచూపే విధంగా లేడీస్ అండ్ జెంటిల్ మెన్ పదాలు ఉన్నాయని ఇకనుంచి అటువంటి మాటలు వినిపించవని చెప్పారు. దానికి ప్రత్యామ్నాయంగా ప్రయాణికులను ‘ఎవ్రీవన్’ లేదా ‘ఆల్ ప్యాసింజర్స్’ అని మాత్రమే పిలుస్తామని ఎయిర్ లైన్స్ అధికారులు ప్రకటించారు. లేడీస్..జెంట్సే కాకుండా థర్డ్ జెంటర్స్ కూడా విమానాల్లో ప్రయాణిస్తుంటారని ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్’ అనే సంభోధన వారికి వర్తించదని వారు ఫీలయ్యే అవకాశముంటుందని అందుకే ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్’ సంభోధన మార్చాలనుకున్నట్లుగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

లేడీస్ అండ్ జెంటిల్ మెన్ అని పిలవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు కూడా తమ అధ్యయనంలో తేలిందని అధికారులు వివరించారు. అందుకే ప్రయాణీకుల సౌకర్యార్థం తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇకపోతే జపనీస్ భాషలో లింగభేదం చూపే పదాలను సైతం వాడడాన్ని బ్యాన్ చేశారు. లింగ భేదం తెలియకుండా పలు ఇతర ప్రాంతాల్లో కస్టమర్స్ వంటి పదాలను మాత్రమే వాడుతున్నారు. సొంత జపనీస్ భాషలో ఇప్పటికే లింగ భేదం తెలిపే పదాలను బ్యాన్ చేశారు. నవంబర్ 1 నుంచి ఇంగ్లిష్ భాషలో కూడా లింగ భేదం వంటి పదాలు వాడకుండా చర్యలు తీసుకోనున్నారు.