Templates by BIGtheme NET
Home >> Cinema News >> విమానం హైజాక్ లో 212 మంది భారతీయుల్ని కాపాడిన వీరుడి కథ!

విమానం హైజాక్ లో 212 మంది భారతీయుల్ని కాపాడిన వీరుడి కథ!


విమానం హైజాక్ నేపథ్యంలో హాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. వీటి స్ఫూర్తితోనే ఇంతకుముందు కింగ్ నాగార్జున కథానాయకుడిగా గగనం సినిమా కూడా వచ్చింది. అయితే అది తమిళ వాసనలతో తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. తమిళంలోనూ ఆశించిన విజయం దక్కించుకోలేదు.

ఇక ఇదే కాన్సెప్టుతో ప్రస్తుతం కిలాడీ అక్షయ్ కుమార్ ఓ భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. బెల్ బాటమ్ అనేది టైటిల్. ఇందులో లారా దత్తా- హ్యూమా ఖురేషి సహా పలువురు టాప్ స్టార్లు నటిస్తున్నారు. ఆగస్టు 21న విదేశాల్లో చిత్రీకరణ ప్రారంభించగా అక్టోబర్ ఎండ్ వరకూ చిత్రీకరణ సాగనుందని తెలిసింది. ఇక అన్ లాక్ 4.0 సందర్భంగా విదేశాల్లో ప్రారంభమైన తొలి బాలీవుడ్ చిత్రమిదేనన్న ముచ్చటా సాగుతోంది.

ఈ సినిమా 80లలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందిస్తున్నారని సమాచారం. 212 మంది భారతీయుల్ని హైజాక్ నుంచి కాపాడిన వీరుడి కథాంశమిది. నాటి వాతావరణాన్ని సెట్స్ లో రీక్రియేట్ చేశారు. రంజిత్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అక్షయ్ ఓ స్పై పాత్రలో నటించనున్నారు. విమానం హైజాక్ నేపథ్యం అనగానే సినిమా ఆద్యంతం ఊపిరి సలపనివ్వని ట్విస్టులతో కుర్చీ అంచున కూచోబెట్టాలి. అంత థ్రిల్లింగ్ గా తెరకెక్కిస్తేనే ఆడియెన్ కనెక్టవుతారు. ఇప్పటికే పలు హాలీవుడ్ చిత్రాల్ని అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ లో వీక్షించిన ఆడియెన్ కి పూర్తిగా కొత్త సరంజామా కావాలి. మరి అది అక్షయ్ బృందం ఇస్తుందా లేదా? అన్నది చూడాలి. హైజాక్ నేపథ్యం అనగానే భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోకి అనువదించి రిలీజ్ చేసేందుకు ఆస్కారం ఉంది.