యువ హీరో మేకోవర్ చూసి వావ్ అనాల్సిందే..!

0

చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న యువ హీరో నాగ శౌర్య ఇప్పుడు లుక్ మార్చేశాడు. తన కెరీర్లో 20వ చిత్రంగా రాబోతున్న మూవీ కోసం శౌర్య వర్కౌట్స్ చేసి తన కటౌట్ ని మార్చేశాడు. ఇంట్లోనే జిమ్ ని రెడీ చేసుకొని కఠోర వ్యాయామాలు చేస్తున్న నాగ శౌర్య కండలు తిరిగిన దేహాన్ని చూసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. గత ఆరు నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన శౌర్య.. మళ్ళీ సెట్స్ లో అడుగుపెట్టడానికి రెడీ అయ్యాడు. ఈ క్రమంలో తాజాగా నాగశౌర్య సోషల్ మీడియాలో ఓ పిక్ ని పోస్ట్ చేసి ‘బాడీ విషయానికి వస్తే.. అది ట్రైనర్ కి సంబంధించిన అంశం’ అంటూ పేర్కొన్నాడు. ఈ ఫొటోలో తన ట్రైనర్ తో కలిసి ఉన్న నాగశౌర్య మేకోవర్ చూస్తే అందరూ వావ్ అనాల్సిందే. ఇంకేముంది ఆరు పలకల దేహంతో నిలబడి ఉన్న నాగ శౌర్య ఫోటోకి లైకులు కొడుతూ సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు.

కాగా #NS20 చిత్రానికి ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె నారంగ్ – పుష్కర్ రామ్మోహన్ రావు – శరత్ మరార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాలభైరవ సంగీతం సమకూరుస్తుండగా రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ అని తెలుస్తోంది. ఇటీవలే చిత్ర యూనిట్ విడుదల చేసిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలోనే ప్రారభించబోతున్నారని సమాచారం.