సూపర్ స్టార్ ద్విభాషా చిత్రం త్వరలో సెట్స్ పైకి

0

తమిళ సూపర్ స్టార్ ధనుష్ కి బాలీవుడ్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. అక్కడ నటించిన తొలి సినిమాతోనే తనదైన ముద్ర వేశాడు. రాంజానా సినిమాతో తెరంగేట్రం చేసిన ధనుష్ ఆరంగేట్రమే రియల్ సూపర్ స్టార్ అని పిలిపించుకున్నాడు. ఒక రకంగా తనదైన నేచురల్ పెర్ఫామెన్స్ తో హిందీ ఆడియెన్ కి పిచ్చిగా నచ్చేశాడు. ఆ తర్వాతా అతడు నటించే సినిమాల కోసం ఆడియెన్ ఆసక్తిగా వేచి చూసారంటే ఆ క్రేజును అర్థం చేసుకోవాలి.

ఆ క్రమంలోనే ధనుష్ తమిళ్- హిందీ ద్విభాషా చిత్రాలకు సన్నాహాలు చేస్తున్నారు. కిలాడీ అక్షయ్ కుమార్ తో కలిసి ఇటీవలే ధనుష్ అట్రాంగి రే అనే సినిమాని ప్రకటించాడు. ఆనంద్ ఎల్ రాయ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే దీని గురించి అధికారిక ప్రకటన వచ్చింది. అట్రాంగి రే లో యంగ్ స్టార్లెట్ సారా అలీ ఖాన్ ధనుష్ సరసన నటిస్తోంది. ఇదివరకూ ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేస్తే వాటికి అద్భుత స్పందన వచ్చింది.

ఈ చిత్రం షూటింగ్ మార్చి నెల నుండి ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. తాజా వార్త ఏమిటంటే… ఈ నెల చివరి నుండి ధనుష్ .. సారా అలీఖాన్ ఎపిసోడ్లతో షూటింగ్ ప్రారంభించాలని చిత్రబృందం యోచిస్తోంది. బెల్ బాటమ్ షూటింగ్ కోసం స్కాట్లాండ్ లో ఉన్న అక్షయ్ కుమార్ ఈ ఏడాది చివరి నాటికి అట్రాంగి సెట్స్ లో చేరనున్నట్లు సమాచారం.