మోడీ రజినీల తర్వాత మరో స్టార్ సాహస యాత్ర

0

డిస్కవరీ ఛానెల్ చూసే ప్రేక్షకులకు సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన తనతో పాటు అప్పుడప్పుడు ప్రముఖులను కూడా సాహస యాత్రలకు తీసుకు వెళ్తాడు. ఇప్పటి వరకు ఎన్నో సాహస యాత్రలు చేసిన బేర్ గ్రిల్స్ ఇండియాలో ప్రధాని నరేంద్ర మోడీ మరియు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ లతో సాహస యాత్రలను చేసిన విషయం తెల్సిందే. వారి వయసు రీత్యా కాస్త సాహసమే అయినా కూడా బేర్ గ్రిల్స్ వారితో సునాయాసంగా ఆ సాహసాలు చేయించాడు.

ఈసారి బాలీవుడ్ కిలాడీ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తో సాహస యాత్రను బేర్ గ్రిల్స్ చేయించాడు. అందుకు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. అక్షయ్ కుమార్ ఈ ప్రోమోను విడుదల చేశాడు. నన్ను అనుకుంటున్నారా… అయితే పిచ్చివారే ఇలా అడువులోకి వెళ్తారు అంటూ సరదాగా కామెంట్ చేశారు. ఈ ఎపిసోడ్ సెప్టెంబర్ 11వ తారీకున ప్రసారం అవ్వబోతుంది. డిస్కర్ వైల్డ్ లైఫ్ కోసం ఇప్పటి వరకు బేర్ గ్రిల్స్ ఎన్నో సాహసయాత్రలు చేశాడు.

ఈసారి అక్షయ్ తో చేసిన సాహస యాత్ర గురించి ఆయన మాట్లాడుతూ జీవితమంటే ఓ సాహస యాత్ర. వాటిని ఎంజాయ్ చేసే వారు కొందరు మాత్రమే ఉంటారు. అక్షయ్ కుమార్ ఒక సూపర్ సాహస యాత్రికుడు అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఇప్పటి వరకు మోడీ రజినీకాంత్ ల పేరుతో ఉన్న సాహస యాత్ర జాబితాలో ఇప్పుడు అక్షయ్ కుమార్ చేరడం విశేషం.

 

View this post on Instagram

 

You thinking I mad… but mad only going into the wild. #IntoTheWildWithBearGrylls @beargrylls @discoveryplusindia @discoverychannelin

A post shared by Akshay Kumar (@akshaykumar) on