ప్రియుడి అపార్ట్ మెంట్ పక్కన 32 కోట్లతో సొంతిల్లు కొనుక్కున్న ఆలియా

0

బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్- అలియా భట్ ఏడాదిన్నరగా రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. తొలిసారిగా ఈ జంట ఫాంటసీ డ్రామా బ్రహ్మాస్త్రలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ లాక్ డౌన్ వల్ల మూవీ రిలీజ్ అంతకంతకు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం.. ఆలియా బాంద్రాలోని పాలి హిల్ కాంప్లెక్స్ లో ఐదో అంతస్తులో ఖరీదైన అపార్ట్ మెంట్ కొనుక్కున్నారని తెలిసింది. అలియా కొత్త ఇల్లు కొనడం పెద్ద విషయం కాదు కాని.. అసలు వార్త ఏమిటంటే.. ఆమె ప్రియుడు రణబీర్ కపూర్ కూడా అదే పాలి హిల్ కాంప్లెక్స్ లో 7వ అంతస్తులో బ్యాచిలర్ హోమ్ ని కలిగి ఉన్నారు. ఈ కాంప్లెక్స్ రణబీర్ ఫ్యామిలీ నివశించే `కృష్ణ రాజ్ బంగ్లా`కు చాలా దగ్గరలో ఉందని సమాచారం.

అలియా భట్ ఇంటి లోపలి ఇంటీరియర్ డిజైన్ మొత్తం కింగ్ ఖాన్ వైఫ్ గౌరీ ఖాన్ చూసుకుంటున్నట్లు తెలిసింది. బాలీవుడ్ మీడియా ప్రకారం అలియా భట్ ఇంటి ధర 32 కోట్లు ఉంటుందిట. ఒకే కాలనీ ఒకే భవంతిలో ఆలియాకి ఒకటి రణబీర్ కి ఒకటి సొంతిల్లు ఉన్నాయన్నమాట.