రకుల్.. చూస్తుండగానే 7 వసంతాల కెరీర్ జర్నీ

0

జయాపజయాలతో కొందరికి వెలుగుతుంది. అప్పుడప్పుడు ఒక బ్లాక్ బస్టర్ కొట్టినా కొన్నేళ్ల పాటు కెరీర్ కి ఏ డోఖా ఉండదు. ఆ కోవకే చెందుతుంది అందాల రకుల్ ప్రీత్ సింగ్. అందానికి అందం ఒడ్డు పొడుగు ఉన్న ఈ భామకు మన తెలుగు స్టార్ హీరోలు వరుసగా అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేయడంతో కెరీర్ పరంగా వెనుదిరిగి చూసిందే లేదు.

దీపం ఉండగానే చక్కదిద్దుకునే నైజం ఉన్న రకుల్ తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్ 47 పేరుతో జిమ్ లను నిర్వహిస్తోందంటే అర్థం చేసుకోవాలి. టాలీవుడ్ కథానాయికగా ఆర్జించినదే ఇలా పెట్టుబడులు పెడుతోంది. రాకుల్ ప్రీత్ సింగ్ ఆదివారం నాటికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఏడేళ్లు పూర్తి చేసినందుకు ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏడు సంవత్సరాల క్రితం నుంచి ఇన్నాళ్ల జర్నీకి సంబంధించిన ఛాయాచిత్రాలను ఇన్ స్టా లో షేర్ చేస్తోంది ఈ భామ.

# 7ఇయర్స్ ఆఫ్ TFI అనే హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగించి రకుల్ ఎమోషన్ కి గురైంది. “అప్పుడు అందరూ నవ్వితే.. ఇప్పుడు అందరినీ నవ్విస్తున్నాను. కారణం నన్ను చాలా ప్రేమతో అంగీకరించిన ప్రజలే. ఒక దిల్లీ అమ్మాయి నుండి పక్కింటి తెలుగు అమ్మాయి వరకు.. ఈ ప్రయాణాన్ని ఎంతో అందంగా ఉంది. నన్ను నమ్మిన ప్రతి దర్శకుడు.. నిర్మాత- కోస్టార్- స్నేహితుడు – అభిమాని అందరూ నన్ను ప్రోత్సహించారు. ప్రశంసించారు .. విమర్శించారు. రోజులు గడిచేకొద్దీ నాకు మంచిగా ఎదగడానికి నాకు సహాయపడండి. నా కుటుంబం లేకుండా ఏదీ సాధ్యం కాదు.. కుటుంబం.. నా మేనేజర్ నా బృందం అందరివల్లనే“ అంటూ సుదీర్ఘంగా ప్రస్థావించింది.

కన్నడ- తెలుగు- తమిళ చిత్రాలతో కెరీర్ ప్రారంభించి బాలీవుడ్ లోనూ తనకంటూ అవకాశాల్ని సృష్టించుకుంటోంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో టాలీవుడ్ లో ప్రవేశించి అటుపై పలు హిట్ చిత్రాల్లో నటించింది రకుల్. పండగా చెస్కో-నాన్నకు ప్రేమాతో-రారండోయ్ వేదుకా చూద్దాం -స్పైడర్ – మన్మదుడు 2 వంటి తెలుగు చిత్రాలలో రాకుల్ నటించారు. టాలీవుడ్ సూపర్ స్టార్స్ మహేష్ బాబు- రామ్ చరణ్- జూనియర్ ఎన్టీఆర్ – నాగార్జున అక్కినేని -అల్లు అర్జున్ లాంటి స్టార్ల సరసన అవకాశాలు అందుకుంది. బాలీవుడ్ చిత్రాలలో `దే దే ప్యార్ దే-మార్జావాన్-సిమ్లా మిర్చి తదితర చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ – అజయ్ దేవ్ గన్ లతో కలిసి మేడే అనే థ్రిల్లర్ డ్రామాలో నటిస్తోంది. ఈ చిత్రానికి అజయ్ దేవ్గన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రకుల్ పైలట్ పాత్రలో నటి కనిపిస్తుంది.