ఎదుటివారు ఏ రంగు దుస్తుల్ని ధరిస్తే అందంగా ఉంటారు?.. మెగాస్టార్ చిరంజీవి అమితంగా ఇష్టపడే రంగు ఏది? ఈ రెండిటికీ కామన్ ఆన్సర్ – బ్లాక్ (నలుపు). చాలామంది నలుపు ధరించడం దుష్ప్రభావం చూపిస్తుందనే సెంటిమెంట్ ఫీలవుతుంటారు కానీ.. ఫ్యాషన్ ప్రపంచంలో బ్లాక్ డిజైనర్ దుస్తులకు ఉండే క్రేజు వేరేగా ఉంటుంది. ఇటీవల సిల్క్ పారదర్శక ఓవర్ టాప్ దుస్తులు .. బ్లాక్ ప్యాంట్ క్రాప్ టాప్ మగువల్లో క్రేజీగా మారాయి. మోడ్రన్ ఫ్యాషనిస్టా.. బిజినెస్ ఎంటర్ […]
తెలుగులో టాప్ హీరోయిన్ లిస్టులో ఉంది పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఆన్ స్క్రీన్ లో తన లుక్ తో కుర్రకారు మతి పోగొడుతుంది ఈ చిన్నది. అయితే.. ఆ స్ట్రక్చర్ ఊరికే వచ్చింది కాదు. దేవుడిచ్చిన అందాన్ని సౌష్టవాన్ని.. ఇలా కష్టపడి కాపాడుకుంటోంది ఈ చిన్నది. ఫిట్ నెస్ కాపాడుకోవడంలో తనకు తానే సాటి అన్నట్టుగా.. నిత్యం కఠినమైన వర్కవుట్లు చేసే ఈ భామ.. ప్రశాంతంత కోసం ఇలా యోగాసనాలు కూడా వేస్తుంది. మాల్దీవుల […]
కెరీర్ పరంగా మరో రెండేళ్ల పాటు డోఖా లేనన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవల రేస్ లో వెనకబడుతోందన్న కథనాల నడుమ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులకు సంతకాలు చేసి రయ్ మని దూసుకొచ్చింది. తనపై విమర్శలు వచ్చిన ప్రతిసారీ ఇదే రకంగా సమాధానమిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో రకుల్ రకరకాల విషయాలపై మనసు విప్పి మాట్లాడింది. రకుల్ ఇప్పటికి ఆరు చిత్రాలతో బిజీగా ఉన్నానని చెప్పింది. రాబోయే రెండేళ్ళ వరకు బిజీగా ఉన్నానని […]
ఈమద్య కాలంలో సెల్రబెటీలు వరుసగా మాల్దీవుల్లో చక్కర్లు కొట్టేందుకు వెళ్తారు. నెలల తరబడి కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయిన స్టార్స్ ఎట్టకేలకు అవకాశం దక్కడంతో దుబాయ్ మరియు మాల్దీవులకు వెళ్లారు. సాదారణంగా అయితే అమెరికా.. లండన్.. యూరప్ కు వెళ్లే సెల్రబెటీలు ఈసారి పూర్తిగా దుబాయ్ మరియు మాల్దీవులకు వెళ్లారు. అక్కడే కరోనా తక్కువ ఉండటం ప్రధాన కారణం అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది హీరోయిన్స్ మాల్దీవులకు వెళ్లి అక్కడ హాట్ ఫొటో షూట్ […]
టాలీవుడ్ లో స్టార్ హీరోయన్ గా వెలుగు వెలిగి ఒక్కసారిగా డల్ అయిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గత ఏడాది ఈమె కెరీర్ పరంగా చాలా ఎత్తు పల్లాలను చవి చూడాల్సి వచ్చింది. అవకాశాలు రావడమే గగనం అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఈమెకు మూడు వరుస సినిమాలు వచ్చాయి. రెండు తెలుగులో ఒకటి హిందీలో ఈమె నటిస్తుంది. అయితే ఈ మూడు కూడా ఓటీటీలో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న […]
జయాపజయాలతో కొందరికి వెలుగుతుంది. అప్పుడప్పుడు ఒక బ్లాక్ బస్టర్ కొట్టినా కొన్నేళ్ల పాటు కెరీర్ కి ఏ డోఖా ఉండదు. ఆ కోవకే చెందుతుంది అందాల రకుల్ ప్రీత్ సింగ్. అందానికి అందం ఒడ్డు పొడుగు ఉన్న ఈ భామకు మన తెలుగు స్టార్ హీరోలు వరుసగా అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేయడంతో కెరీర్ పరంగా వెనుదిరిగి చూసిందే లేదు. దీపం ఉండగానే చక్కదిద్దుకునే నైజం ఉన్న రకుల్ తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్ 47 పేరుతో జిమ్ లను […]
అందాల రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల మాల్దీవుల విహారంలో చిలౌట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులతో కలిసి ఈసారి బీచ్ సెలబ్రేషన్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసింది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో నిరంతర అప్ డేట్స్ తో చాలా యాక్టివ్గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే మాల్దీవుల చిలౌట్ కి సంబంధించిన రకరకాల ఫోటోల్ని షేర్ చేశారు. నిన్నటితో విహారయాత్రను ముగించి ముంబైకి తిరిగి పయనమయ్యిందట. లేటెస్టుగా రకుల్ సోషల్ మీడియాలో […]
మాల్దీవులపై తారల దాడి కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు అందాల నాయికలు మాల్దీవుల వెకేషన్ లో సేద దీరి ఇళ్లకు చేరుకున్నారు. నేడు బర్త్ డే గాళ్ తారా సుతారియా మాల్దీవుల సెలబ్రేషన్ నుంచి రెడ్ హాట్ బికినీ ఫోటోల్ని షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈలోగానే సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవుల విహారం గూగుల్లో ట్రెండింగ్ గా మారింది. రకుల్ తన కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవుల టూర్ లో ఉందిప్పుడు. ఇన్స్టాగ్రామ్లో […]
సినిమాల పరంగా కాస్త డల్ గా ఉన్నా కూడా సోషల్ మీడియాలో అమ్మడి జోరు అంతా ఇంతా కాదు. ఇన్ స్టా గ్రామ్ లో 15.6 మిలియన్ ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ అమ్మడు ప్రతి రోజు హాట్ ఫొటోలను డైలీ లైఫ్ అప్ డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు సముద్రపు అందాలను ఒంటరిగా ఆస్వాదిస్తూ ఉన్న ఫొటోను షేర్ చేసింది. బికినీలో సముద్రపు అంచన నిల్చున్న ఈ […]
టాలీవుడ్ హాట్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆమద్య రెగ్యులర్ గా ఫొటోలు మరియు వీడియోలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉండేది. కాని ఆమద్య వేరే విషయాల వల్ల దురదృష్టవశాత్తు మీడియాలో ప్రచారం అవ్వాల్సి వచ్చింది. ఆ వ్యవహారం నుండి మెల్లగా బయట పడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే క్రిష్ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ కు జోడీగా రకుల్ ఆ సినిమాలో నటించిన విషయం తెల్సిందే […]
పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోతున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ముంబై టు హైదరాబాద్ వరుస ప్రయాణాలు చేస్తోంది. తాజాగా మరోసారి శంషాబాద్ ఏయిర్ పోర్ట్ లో సందడి చేసింది. లేటెస్టుగా లేత రంగు హాఫ్ షర్ట్ జీన్స్ ధరించి కనిపించింది. కెమెరా లెన్స్ ని ఏమాత్రం మిస్సవ్వకుండా కూల్ గా శంషాబాద్ ఏయిర్ పోర్ట్ నుంచి బయటపడింది. ఈసారి కూడా ఫేస్ మాస్క్ .. […]
తెలుగు తెరమీద కొంత కాలం పాటు స్టార్ హీరోయిన్ హోదాను ఎంజాయ్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కొని తీవ్ర ఇబ్బందులు పడింది. ఆమె స్నేహితురాలు రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో రకుల్కు కష్టాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యం లో నెల రోజుల పాటు రకుల్ ముంబైలోనే ఉండిపోయింది. గత నెల 25న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) ఎదుట హాజరైంది. డ్రగ్స్ కేసు రాకముందే ఆమె పలు సినిమాలకు ఒప్పుకున్నది. […]
అందాల రకుల్ ప్రీత్ సింగ్ పై రకరకాల ఆరోపణలు అభిమానుల్ని కలవరపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మాదక ద్రవ్యాల దుర్వినియోగం (డ్రగ్స్) కేసులో కి మీడియా రకుల్ పేరును డ్రాగ్ చేసింది. ఇందులో నిజానిజాలపై దర్యాప్తునకు సంబంధించి గత నెలలో ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) ఎదుట హాజరైన రకుల్ ప్రీత్ .. ఆ తర్వాత తనకు ఈ కేసులతో ఎలాంటి సంబంధం లేదని.. విచారణకు సహకరించేందుకే ఎన్.సి.బి ఎదుటకు వచ్చానని వెల్లడించారు. అక్కడ విచారణ […]
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఇండస్ట్రీకి పరిచయమైన తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. తెలుగులో మహేష్ బాబు – రవితేజ – ఎన్టీఆర్ – రామ్ చరణ్ – అల్లు అర్జున్ – నాగచైతన్య – రామ్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన రకుల్ ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. ఐదేళ్ల పాటు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా రాణించింది. బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. […]
ఎవరూ గీత దాటకూడదు. కానీ.. అందుకు భిన్నంగా తమకు తోచినట్లుగా వ్యవహరించే ధోరణి మీడియాలో ఎక్కువ అవుతుంది. బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ముంబయిలో చోటు చేసుకున్న హైడ్రామానే దీనికి నిదర్శనం. అధికారుల విచారణకు హాజరయ్యే సినీ తారలను ప్రశ్నించేందుకు కొన్ని చానళ్లు వ్యవహరించిన తీరు చూసి.. ఇదెక్కడి ఆరాచకమని ఫీలైనోళ్లు లేకపోలేదు. కొన్ని చానళ్లు తమకు తామే కోర్టులుగా భావిస్తూ తీర్పులు చెప్పేసేలా వ్యాఖ్యలు చేయటం.. ముఖం ముందు మైకు పెట్టేసి.. నేను అడుగుతాను.. నువ్వు […]
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ బికినీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ బికినీ ఫొటోలు రీసెంట్ వి కాదు. ఆమె మోడల్ గా చేసిన టైంలో తీసుకున్న ఫొటో షూట్ స్టిల్స్. హీరోయిన్ గా పరిచయం కాకముందు రకుల్ ప్రీత్ సింగ్ మోడలింగ్ చేసింది. ఆ సమయంలో బికినీలో ఫొటో షూట్ ఇచ్చింది. కాలేజ్ డేస్ లో ఆమె ఇచ్చిన బికినీ ఫొటో […]
బాలీవుడ్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. గడించిన శుక్రవారం ఎన్సీబీ ఎదుట హాజరైన రకుల్ ను సుమారు 4 గంటల పాటు విచారించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాబడిన రియా చక్రవర్తితో రకుల్ జరిపిన వాట్సాప్ చాటింగ్ గురించి ఆమెను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే ఎన్సీబీ విచారణ తర్వాత రెండు […]
డ్రగ్స్ కేసు అంతకంతకు హీట్ పెంచుతోంది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ముందు టాప్ హీరోయిన్లు విచారణకు హాజరైన సంగతి విధితమే. ఇక వీళ్లలో సౌత్ కథానాయిక రకుల్ కూడా విచారణకు హాజరైంది. అయితే ఆమెని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం పావులు కదుపుతోందా? అంటే అవునని కాంగ్రెస్ నేత సంపత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో డ్రగ్ కేసు కాస్తా తెలంగాణలో రాజకీయ రంగు పులుముకుంటోంది. ముంబై డ్రగ్స్ కేసుతో హైదరాబాద్ కు లింకులున్నాయని సంపత్ ప్రకటించడం […]
డ్రగ్స్ కేసులో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఉందని నేషనల్ మీడియాలో వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆమె గురించి చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన నటి రియా చక్రవర్తి పలువురు సెలబ్రిటీల పేర్లు వెల్లడించిందని.. అందులో రకుల్ – సారా అలీఖాన్ పేర్లు కూడా ఉన్నాయని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మీడియాలో తనకు వ్యతిరేకంగా వస్తున్న కథనాలను నిలిపివేయాలని […]
బాలీవుడ్ – శాండల్ వుడ్ లలో రేగిన డ్రగ్స్ మంటలు.. టాలీవుడ్ నూ తాకాయి. డ్రగ్స్ వ్యవహారం లో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. టాలీవుడ్ లో డ్రగ్స్ ఆరోపణలు రావడం కొత్తేమీ కానప్పటికీ.. ఈసారి స్టార్ హీరోయిన్ పై ఆరోపణలు రావడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ రియా చక్రవర్తిని మాదకద్రవ్యాల […]