Templates by BIGtheme NET
Home >> Cinema News >> #టెక్నిక్.. బిజినెస్ ఉమెన్ లా కనిపించాలంటే..?

#టెక్నిక్.. బిజినెస్ ఉమెన్ లా కనిపించాలంటే..?


ఎదుటివారు ఏ రంగు దుస్తుల్ని ధరిస్తే అందంగా ఉంటారు?.. మెగాస్టార్ చిరంజీవి అమితంగా ఇష్టపడే రంగు ఏది? ఈ రెండిటికీ కామన్ ఆన్సర్ – బ్లాక్ (నలుపు). చాలామంది నలుపు ధరించడం దుష్ప్రభావం చూపిస్తుందనే సెంటిమెంట్ ఫీలవుతుంటారు కానీ.. ఫ్యాషన్ ప్రపంచంలో బ్లాక్ డిజైనర్ దుస్తులకు ఉండే క్రేజు వేరేగా ఉంటుంది.

ఇటీవల సిల్క్ పారదర్శక ఓవర్ టాప్ దుస్తులు .. బ్లాక్ ప్యాంట్ క్రాప్ టాప్ మగువల్లో క్రేజీగా మారాయి. మోడ్రన్ ఫ్యాషనిస్టా.. బిజినెస్ ఎంటర్ ప్రెన్యూర్ రకుల్ కి ఈ తరహా దుస్తులు అంటే యమ క్రేజీ. తాజాగా బ్లాక్ లో కనిపించి రకుల్ ప్రీత్ అందరినీ ఆశ్చర్యపరిచింది. బ్లాక్ డిజైనర్ లుక్ కి సిల్వర్ పర్పుల్ చెవి లోలాకుల్ని ధరించి ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఫోటోని షేర్ చేసింది. రకుల్ క్రీగంటి చూపులతో బ్లాక్ లో కట్టి పడేసింది.

నలుపు దుస్తులు ధరించి రంగురంగుల జీవితాన్ని గడపండి! అన్న ఆసక్తికర క్యాప్షన్ ని ఇచ్చింది ఈ ఫోటోకి. చెన్నైలో త్వరలో జరగనున్న “టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ 2021“ వేడుకకు హాజరయ్యేందుకు ప్రిపేరవుతోంది. మొన్ననే రకుల్ మహాశివరాత్రి సందర్భంగా తన స్నేహితులు సమంత అక్కినేని – లక్ష్మీ మంచు- శిల్పారెడ్డితో కలిసి శివుని సేవలో కనిపించింది. ఆ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ అయ్యింది. ఇంతలోనే బ్లాక్ డ్రెస్ లో రకుల్ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.

రకుల్ ఓ కీలక పాత్రలో నటించిన `చెక్` ఇటీవల రిలీజైంది. రిజల్ట్ నిరాశపరిచిన సంగతి తెలిసిందే. వైష్ణవ్ తేజ్ తో కలిసి క్రిష్ దర్శకత్వంలో నటించింది. ఆ మూవీ టైటిల్ ని త్వరలో ప్రకటించనున్నారు. బాలీవుడ్ లో మేడే అనే చిత్రంతో పాటు వరుసగా సినిమాల్లో నటిస్తోంది. జాన్ అబ్రహాం సరసన ఎటాక్ లోనూ నటించగా ప్రస్తుతం ఈ మూవీ నిర్మాణానంతర పనుల్లో ఉంది.