రకుల్ ను కాపాడేందుకు తెలంగాణ పెద్దల ట్రయల్?

0

డ్రగ్స్ కేసు అంతకంతకు హీట్ పెంచుతోంది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ముందు టాప్ హీరోయిన్లు విచారణకు హాజరైన సంగతి విధితమే. ఇక వీళ్లలో సౌత్ కథానాయిక రకుల్ కూడా విచారణకు హాజరైంది. అయితే ఆమెని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం పావులు కదుపుతోందా? అంటే అవునని కాంగ్రెస్ నేత సంపత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో డ్రగ్ కేసు కాస్తా తెలంగాణలో రాజకీయ రంగు పులుముకుంటోంది. ముంబై డ్రగ్స్ కేసుతో హైదరాబాద్ కు లింకులున్నాయని సంపత్ ప్రకటించడం సంచలనంగా మారింది.

డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన రకుల్ ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని.. అంతే కాకుండా గతంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసుని కావాలనే ప్రభుత్వ పెద్దలు తొక్కి పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేత సంపత్. అయితే ఆ పెద్దలు ఎవరన్నది మాత్రం బయటపెట్టడానికి సాహసించలేదు.

దీంతో డ్రగ్స్ ప్రకంపనలు మరోమారు హైదరాబాద్ ని తాకాయి. టాలీవుడ్ లో 2017లోనే డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. ఒక ప్రత్యేక అధికారితో సిట్ దర్యాప్తు గుట్టు మట్లు అన్నీ బయటపెట్టింది. ఆ సమయంలో పలువురు స్టార్లతో పాటు ఓ దర్శకుడు.. కెమెరామెన్ ని కూడా ఈ వివాదంలో విచారించారు. ప్రభుత్వంపై విమర్శలు వినిపించాయి. అదే సమయంలో పోసాని వంటి సినీపెద్దలు ప్రభుత్వానికి అండగా నిలబడి విమర్శకుల దుమ్ము దులిపారు. ఆ తరువాత ఈ కేసు అటకెక్కింది.