రకుల్.. ఫేష్ షీల్డ్ వేసిన ఇస్టయిల్ తగ్గదుగా..

0

పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోతున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ముంబై టు హైదరాబాద్ వరుస ప్రయాణాలు చేస్తోంది. తాజాగా మరోసారి శంషాబాద్ ఏయిర్ పోర్ట్ లో సందడి చేసింది. లేటెస్టుగా లేత రంగు హాఫ్ షర్ట్ జీన్స్ ధరించి కనిపించింది. కెమెరా లెన్స్ ని ఏమాత్రం మిస్సవ్వకుండా కూల్ గా శంషాబాద్ ఏయిర్ పోర్ట్ నుంచి బయటపడింది. ఈసారి కూడా ఫేస్ మాస్క్ .. ఫేస్ షీల్డ్ ధరించి ఎంతో సెక్యూర్డ్ గా కనిపించింది. ఒళ్లంతా షీల్డ్ లు ధరించినా రకుల్ ఇస్టయిల్ విషయంలో ఎక్కడా తగ్గదనడానికి ఈ ఫోటోనే సాక్ష్యం.

ఇటీవల ఊహించని వివాదంలో ఇరుక్కుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన రకుల్ ఇప్పుడిప్పుడే ఆ వివాదం నుంచి కోలుకుంటోంది. డ్రగ్స్ వివాదం కారణంగా వార్తల్లో నిలిచి అందరి దృష్టిన ఆకర్షించిన రకుల్ కూల్ గా అపవాదు నుంచి బయటపడుతోంది. డ్రగ్స్ వేడి తగ్గడంతో తన పనిలో తాను నిమగ్నమైపోయింది. ప్రస్తుతం క్రిష్ తెరకెక్కిస్తున్న కొండపొలం అనే చిత్రంలో రకుల్ నటిస్తున్న విషయం తెలిసిందే. వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్నారు.

`కొండ పొలం` ఒరిజినల్ నవల ఆధారంగా పక్కా గ్రామీణ నేపథ్యంలో క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో పాటు నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి `చెక్` చిత్రంలో లాయర్ గా నటిస్తున్న రకుల్ బ్లాక్ బస్టర్ మూవీ `భారతీయుడు`కు సీక్వెల్గా వస్తున్న `భారతీయుడు 2` (ఇండియన్ 2) లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి వుంది.