ఇంతకీ మాళవిక ఏం పోగొట్టుకుంది?

0

మాళవికశర్మ… టీవీ కమర్షియల్స్ తో ఆపులరై `నేల టిక్కెట్టు` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ గురించి పరిచయం అవసరం లేదు. మాస్ మహారాజా రవితేజ సరసన నేలటిక్కెట్టు ఆశించిన ఫలితాన్ని అందించలేదు. దీంతో మాళవిక ఎంతగా అందాల విందు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆ తరువాత చెప్పుకోదగ్గ ఆఫర్లు పలకరించకపోవడంతో సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా తనలోని మరో యాంగిల్ కి పదును పెట్టింది.

ఇన్ స్టా వేదికగా మాళవిక వరుస ఫోటోషూట్లతో చెలరేగుతోంది. ఇటీవల సంథింగ్ అనిపించేలా హాట్ థైషోస్ తో ట్రీట్ ఇవ్వడం మొదలుపెట్టింది. నెటిజనులతో పాటు దర్శకనిర్మాతల్ని ఆకర్షించడం కోసం హాట్ హాట్ ఫొటోషూట్లతో చెలరేగింది. మాళవికలో రెబల్ అప్పటికప్పుడు బయటికొస్తుంది. అంతలోనే ట్రెడిషనల్ స్టైలింగ్ తోనూ మైమరిపిస్తుంటుంది. ఈ ఫొటోల్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ బాగానే పాపులర్ అయిపోయింది.

ప్రస్తుతం ఈ అమ్మడు రామ్ హీరోగా నటిస్తున్న `రెడ్` సినిమాలో నటిస్తోంది. ఈ మూవీపై ఈ ముంబై చిన్నది భారీ అంచనాలే పెట్టుకుందట. రెడ్ ఫలితం హీరోయిన్ గా మాళవిక శర్మ భవితవ్యాన్ని నిర్ణయించబోతోంది. ఇదిలా వుంటే నిత్యం చిట్టి పోట్టి డ్రెస్సుల్లో థై షో చేస్తూ ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేసే మాళవిక శర్మ తాజాగా ట్రెడిషనల్ వేర్ లో దర్మనిమిచ్చి షాకిచ్చింది. దీనికి `కొన్ని పోగొట్టకుంటేనే కొన్ని దక్కుతాయి` క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇంతకీ మాళవిక శర్మ ఏం పోగొట్టుకుంది.. ఏం పొందబోతోంది అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.