జూన్ లోనే అత్యంత రహస్యంగా కాజల్ నిశ్చితార్థం!

0

కాజల్ అగర్వాల్ వివాహం ఈ శుక్రవారం కోవిడ్ నియమానుసారం కొద్దిమంది బంధుమిత్రులు సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే. తన చిరకాల మిత్రుడు.. ఫ్యామిలీ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూ ని ఈ నెల 30న కాజల్ అత్యంత సన్నిహితుల మధ్య ముంబైలోని హోటల్ తాజ్ లో వివాహం చేసుకుంది. పింక్ కలర్ లెహెంగాలో హొయలు పోతూ పెళ్లికూతురుగా కాజల్ నింగిలోని చందమామలా కాంతులీనింది. తన చిరకాల కోరిక తీరినందుకు ఇష్టపడిన వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు తన ఆనందాన్ని కాజల్ వ్యక్తం చేసింది.

అయితే కాజల్ ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని మాత్రం బయటికి పొక్కనివ్వకుండా జాగ్రత్త పడినట్టు తెలిసింది. జూన్ లో అత్యంత రహస్యంగా కాజల్ – గౌతమ్ కిచ్లూల ఎంగేజ్మెంట్ జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోల్ని కాజల్ తాజాగా అభిమానులతో పంచుకుంది. ఎల్లో కలర్ డిజైనర్ వేర్ సారీలో కాజల్ మెరిపోతున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.

ఈ సారీని ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారట. ఈ సందర్భంగా ఇంత అందమైన సారీని తన కోసం డిజైన్ చేసినందుకు అది కూడా అత్యవసర సమయంలో ఈ డిజైన్ ని క్రియేట్ చేసినందుకు కాజల్ మనీష్ మల్హోత్రాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. `నా ప్రియమైన మనీష్ మల్హోత్రా నా కోసం ఈ అందమైన చీరను సృష్టించినందుకు ధన్యవాదాలు. జూన్లో లాక్డౌన్ వంటి క్లిష్టమైన సమయంలో ఇది సాధ్యం అవుతుందా అని భావిస్తున్న సమయంలో అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఇలా నా నిశ్చితార్థంలో మీరు భాగమైనందుకు మీ కృషిని అభినందిస్తున్నాను` అని కాజల్ తన ఫొటోలతో పాటు ఆసక్తికరమైన పోస్ట్ ని షేర్ చేసింది.

అన్నట్టు కాజల్ తన నిశ్చితార్థాన్ని గుట్టుగా దాచాల్సిన అవసరం ఏమిటి? ఏవైనా సినిమాల కమిట్ మెంట్లను పూర్తి చేయాలనే ఇలా చేసిందా? అలాంటప్పుడు భారతీయుడు 2 లాంటి భారీ సినిమాకి సంతకం ఎందుకని చేసినట్టు? ఇక మెగాస్టార్ చిరంజీవి -కొరటాల కాంబో `ఆచార్య`కు నిశ్చితార్థం అయ్యాకే కాజల్ సంతకం చేసిందా? అన్న ప్రశ్నలకు తననే సమాధానం అడిగితే.. పెళ్లి తర్వాతా నటనలో కొనసాగుతానని సింపుల్ గా ఇంతకుముందే క్లారిటీ ఇచ్చేసిందిగా…